బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్ర‌ముఖ న‌టి

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-02-13 05:26:20

బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్ర‌ముఖ న‌టి

సార్వ‌త్రిక ఎన్నిక‌లకు  స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో  రాజ‌కీయ పార్టీలు రోజుకోక రంగు పూసుకుని వ్య‌వ‌హ‌రిస్తున్నాయి...2019 లో జ‌రిగే ఎన్నిక‌లలో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప‌లు ప్రాంతాల్లో విస్రృత‌ ప‌ర్య‌ట‌న చేస్తున్నారు నాయ‌కులు...ఈ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌జ‌ల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీకి చెందిన కొంద‌రు ప్ర‌ముఖులు రాజ‌కీయ పార్టీల‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.
 
ఈ నేప‌థ్యంలో ఒడిశా సినీ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టి మ‌హేశ్వ‌త రాయ్, రాజ‌కీయ అరంగేట్రం చేశారు... ఈ రోజు ఆమె బీజేపీ  సీనియర్‌ నేత, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్ స‌మ‌క్షంలో  జరిగిన‌ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పార్టీలో చేరారు.. ఈ స‌మావేశంలో రాయ్ మాట్లాడుతూ... ఎన్డీఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఏ పార్టీ చేయ‌లేని అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను బీజేపీ ప్ర‌భుత్వం చేస్తోంద‌ని ఆమె అన్నారు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పాల‌న చూసే తాను పార్టీలో చేరాన‌ని తెలిపారు.. 
 
ఈమె ఒడిశా ఫిలిం ఇండ‌స్ట్రీలోకి 1976 లో అడుగు పెట్టిన నాటినుంచి నేటి వ‌ర‌కు ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాల‌తో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌ల‌ను సంపాదించుకున్నారు...తాజాగా రాయ్ న‌టించిన !!దేలే క‌థా సారే!! చిత్రంలో ఉత్త‌మ న‌టిగా అవార్డు కూడా అందుకున్నారు... కాగా ఇప్ప‌టికే చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చేందిన మిహిర్ దాస్, అను చౌద‌రీలు బీజేపీ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.