బీజేపీకి మ‌రో షాక్

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-02-06 11:44:24

బీజేపీకి మ‌రో షాక్

భార‌తీయ జ‌నతా పార్టీ అప్ర‌తిహ‌తంగా విజ‌యాల‌ను మూట‌గ‌ట్టుకుంటోంది, అయితే ఆ విజ‌యాల వెనుక ఎటువంటి క‌ష్టం ఉన్నా అంతా ప్ర‌ధాని మోదీనే సెంట‌ర్ అవుతున్నారు పార్టీలో.. ఇటు రాజ‌స్ధాన్ లో రెండు ఎంపీ స్ధానాలు కాంగ్రెస్ గెలుచుకోవ‌డంతో ఉప ఎన్నిక‌ల్లో  దిమ్మ‌తిరిగి క‌మ‌లంపార్టీకి షాక్ త‌గిలింది.
 
మ‌రో పక్క శివ‌సేన ఇటీవ‌ల మిత్ర‌ప‌క్షంగా తాము ఉండ‌లేమ‌ని బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి ఇంకా క‌మ‌లం పార్టీకి క‌నుల‌లో మెద‌లుతూనే ఉంది.. ఇక ఏపీకి బ‌డ్జెట్ కేటాయింపుల్లో స‌రైన న్యాయం జ‌ర‌గ‌లేద‌ని మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ కూడా వ్య‌తిరేక‌త చూపించిన విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఒంట‌రిగా పోటీ చేస్తాము అని తెలిపింది శివ‌సేన‌.. అయితే ఈ  ప్ర‌క‌ట‌న బీజేపీని టెన్ష‌న్ పెట్టింది...ఇక సీఎం చంద్ర‌బాబు ఉద్ద‌వ్ తో కూడా మాట్లాడారు అంటూ ప‌లు వార్త‌లు వైర‌ల్ అయ్యాయి.
 
ఇటు బీజేపీకి మిత్ర‌ప‌క్షాలు గా ఎన్డీయేలో కొన‌సాగుతున్నాయి టీడీపీ -శివ‌సేన -అకాలీద‌ళ్... ఇటీవ‌ల శివ‌సేన బ‌య‌ట‌కు రావ‌డం... వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం కూడా ఎటువంటి రూటు చూసుకుంటుందా అని రాజ‌కీయంగా అస్దిర‌త ఏర్ప‌డింది. తాజాగా లోక్ స‌భ‌లో అకాలీద‌ళ్  కూడా శివ‌సేన‌కు మ‌ద్ద‌తు తెలిపింది, దీంతో బీజేపీ పై వ్య‌తిరేక ప‌వ‌నాలు దేశంలో మ‌రింత పెరుగుతున్నాయి అని అంటున్నారు సీనియ‌ర్లు.
 
బీజేపీ పై అకాళీద‌ళ్ నాయ‌కులు కూడా ఫైర్ అవుతున్నారు.. మిత్ర‌ప‌క్షంగా ఉన్న త‌మ‌కు స‌రైన గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని వారు వాపోతున్నారు.. అప్పుడు వాజ‌పేయ్ త‌మ పార్టీకి మిత్ర‌ప‌క్షాల‌కు గౌర‌వం ఇచ్చేవార‌ని ఇప్పుడు ఆ గౌర‌వం లేద‌ని అన్నారు అకాలీద‌ళ్ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.