షాకింగ్ . ...అమెరికాలో ఆగిపోయిన ప్రభుత్వం

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-01-20 09:54:18

షాకింగ్ . ...అమెరికాలో ఆగిపోయిన ప్రభుత్వం

అమెరికాలో  ఊహించ‌ని ప‌రిణామం  చోటుచేసుకుంది. ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడిగా అవుతే ఇలాంటివి జ‌రుగుతాయ‌ని ప‌లువురు  విశ్లేష‌కులు ముందే అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పుడు అలాంటి ప‌రిణామాలే అమెరికాలో చోటుచేసుకున్నాయి. గ‌డువులోగా ద్ర‌వ్య‌వినిమ‌యి బిల్లు అమోదం పొంద‌క‌పోవ‌డంతో  ష‌ట్ డౌన్ ప్ర‌క‌టించేశారు. దీంతో  అమెరికా ప్ర‌భుత్వానికి సంబంధించిన ఆర్ధిక లావాదేవీలు నిలిచిపోయాయి. అత్య‌వ‌స‌ర సేవ‌లు మాత్రం కొన‌సాగుతున్నాయి. 

ద్ర‌వ్య‌వినిమ‌యి బిల్లు పై రిప‌బ్లిక‌న్లు-డెమోక్ర‌టిక‌న్ల‌కు మ‌ధ్య చ‌ర్చ‌లు కొన‌సాగిన‌ప్ప‌టికీ అవి విఫ‌లం కావ‌డం చేత బిల్లు  ఆమోదం పోంద‌లేదు. ఈ క్ర‌మంలో ట్రంప్ ఏడాది పాల‌న పూర్తి చేసుకున్న మురుస‌టి రోజునాడే ఆయ‌న‌కు షాక్ త‌గిలిన‌ట్ల‌యింది. ప్ర‌భుత్వం నుండి డెమోక్ర‌టిక‌న్ల‌కు స్వాప్నికుల భ‌ద్ర‌త విష‌యంలో స్ప‌ష్ట‌మైన హ‌మీ రాక‌పోవ‌డం కార‌ణంగానే ఈ ప‌రిణామం చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.