నాలిక క‌ర్చుకున్న బీజేపీ

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-03-30 16:46:58

నాలిక క‌ర్చుకున్న బీజేపీ

బీజేపీ అంటే మోదీ.... మోదీ అంటే అమిత్ షా.... ఇక ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాష్ట్రాల్లో బీజేపీ త‌న విజ‌య‌ఢంకా మోగించేందుకు సిద్దం అవుతూ ఆ రాష్ట్రాల‌లో క‌మ‌లం పార్టీ గుర్తును ఎగుర‌వేసే దిశ‌గా ముందుకు వెళుతుందో... అయితే రాహుల్ గాంధీకి పప్పు అనే బిరుదును ఇచ్చింది సోష‌ల్ మీడియాలో... ఏమీ తెలియ‌ని రాజ‌కీయ నాయ‌కుడు అని ఓ స‌ప‌రేట్ సోష‌ల్ మీడియా వింగ్ అలా ప్ర‌చారం చేసింది.
 
ఇక ఉత్త‌రాధి రాష్ట్రాల‌లో విజ‌యం సాధిస్తున్న  బీజేపీ ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విజ‌య‌దుంధుభి కొట్టింది. అయితే ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌లు ఉన్నందున అక్క‌డ బీజేపీ ఫోక‌స్ చేసింది... ప్ర‌స్తుతం అధికార పార్టీ కాంగ్రెస్ ను ఇక్క‌డ ఎలాగైనా ఓడించాలి అనే ఉద్దేశ్యంతో పావులు క‌దుపుతోంది బీజేపీ. ఇక బీజేపీ క‌ర్ణాట‌క‌లో ప్ర‌చారానికి సిద్దం అయింది అయితే మొద‌టి ట‌ర్మ్ లోనే బీజేపీ ఓ చేయ‌కూడ‌ని కామెంట్  చేసింది.
 
కర్ణాటకలో బీజేపీ  చేపడుతున్న ప్రచారంలో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రసంగానికి కన్నడ అనువాదంలో తప్పులు దొర్లాయి. దీంతో ఆ పార్టీకి కక్కలేని, మింగలేని పరిస్థితి ఎదురైంది.. దేవనగిరి జిల్లాలోని చల్లకెరెలో చేపట్టిన ర్యాలీలో అమిత్‌ షా మాట్లాడుతూ సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటకను అభివృద్ధి చేయలేదు. ప్రధాని మోదీపై మీకు నమ్మకముంది గనుక... యడ్యూరప్పకే ఓటేయండి. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా కర్ణాటకను తీర్చిదిద్దుతాం అని పిలుపునిచ్చారు.
 
ఇక్క‌డ సీన్ క‌ట్ చేస్తే, ఆయన ప్రసంగాన్ని కన్నడలో తర్జుమా చేస్తున్న ప్రహ్లాద్‌ జోషి- ‘‘దళితులకూ, పేదలకూ, వెనుకబడినవర్గాల వారికీ ప్రధాని మోదీ ఏమీ చేయరు. ఆయన దేశాన్ని నాశనం చేసేస్తారు. దయచేసి ఆయనకే ఓటేయండి’’ అని పొరపాటుగా చెప్పారు. దీంతో బీజేపీ పై కాంగ్రెస్ విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతోంది.. వ్యంగ్య‌స్త్రాల‌తో బీజేపీపై కాంగ్రెస్ దూసుకుపోతోంది..నిజాన్ని బాగానే  చెప్పారు అంటూ నింద‌లు విమ‌ర్శ‌లు వైర‌ల్ చేస్తోంది.
 
అలాగే రెండు రోజుల క్రితం అమిత్‌ షా విలేకరులతో మాట్లాడుతూ... దేశంలో అవినీతి పోటీ జరిగితే, యడ్యూరప్ప ప్రభుత్వమే విజేతగా నిలుస్తుంది అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడి నాయకులు యడ్యూరప్ప కాదు.. సిద్ధరామయ్య అని సర్దిచెప్పాల్సి వచ్చింది. మొత్తానికి ఈ అప‌శృతులు జ‌ర‌గ‌డం ప‌ట్ల రాజ‌కీయంగా బీజేపీ విమ‌ర్శ‌లు ఎదుర్కుంటోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.