ప్రజల చేత ...ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య నాయకుడు ఆయన ... నిత్యం ప్రజలకు రక్షణ కల్పిస్తూ, వారి సమస్యలను తీర్చే బాధ్యత వేసుకున్న రాజకీయ నేత.. ప్రజా సేవ చేయాల్సిన రాజకీయ నాయకుడే ప్రజలకు పెద్ద సమస్యగామారాడు... అధికారాన్ని అడ్డు పెట్టుకొని మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ దారుణమైన విషయం, దేశంలో పెను సంచలనంగా మారింది.
ఈ దారుణం అరుణాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది... ముఖ్యమంత్రి పేమా ఖండూ తనపై 2008 లో సామూహిక అత్యాచారం చేశారని ఓ యువతి పోలీసుల ముందుకు వచ్చింది....వారు అత్యాచారం చేసినప్పుడు తాను స్పృహలో లేనని పోలీసులకు తెలిపింది ... ముఖ్యమంత్రి తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గతంలో ఇదే విషయాన్ని తనకు స్పృహ వచ్చాక పోలీసులకు తెలిపితే, వారు తనను పట్టించుకోలేదని... చివరికి ఒక న్యాయవాది తరుపున మహిళా సంఘాలను కలిసినా కూడా తనకు న్యాయం జరగలేదని అన్నారు... 2008 లో పేమా అధికారంలో లేకున్నా, రాజకీయ అండదండలతో తనపై అత్యాచారానికి పాల్పడినా, ఆయన తప్పించుకున్నారని ఆ యువతి వెల్లడించింది.
ఈ విషయం ఇప్పటివరకూ ఎవ్వరికి తెలియదని? న్యాయం కోసం ఎంత మందిని కలిసినా ఫలితం దక్కలేదని? తన ఆవేదన తెలిపింది...అయితే ఇప్పటికైనా ముఖ్యమంత్రి పేమా పై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆ యువతి కోరుతోంది... తాను పాపులారిటీ కోసం ఇదంతా చేయట్లేదని ఒక వేళ ఎవరైనా ఇలా చేస్తే వారి జీవితానికే పెద్ద మచ్చలా మారుతుందని, ఆయువతి పేర్కొంది... కాగా తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని తెలిపింది ఆ బాధతురాలు.
Comments