కేజ్రీవాల్ అరెస్ట్ కు రంగం సిద్ధం

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-02-23 04:15:21

కేజ్రీవాల్ అరెస్ట్ కు రంగం సిద్ధం

ఇటీవ‌ల దిల్లీ చీఫ్ సెక్రటరీ పై  ఆప్ ఎమ్మెల్యే లు దాడి చేసిన ఘటన దేశంలో సంచ‌ల‌నం రేపింది.  ఈ ఘ‌ట‌న పై ద‌ర్యాప్తు చేయ‌డానికి ఏకంగా  ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకోవాల‌ని అధికారులు యోచిస్తున్నారు. ఈ ఘ‌ట‌న పై ఆధారాల కోసం నేరుగా  కేజ్రీవాల్ స్వ‌గృహానికి పోలీసులు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చి సోదాలు నిర్వ‌హించారు. దీన్ని సీఎం కేజ్రీవాల్  తీవ్రంగా ఖండించారు.
 
రాజ‌కీయంగా త‌న‌ని ఎదురుకోలేక ఇలాంటి ప‌నులు చేస్తున్నార‌ని బీజేపీ పై విమ‌ర్శ‌లు గుప్పించారు...అవినీతికి, అక్ర‌మానికి నిలువుట‌ద్దం అయిన అమిత్‌షాను విచారించాల‌ని పోలీసుల‌ను డిమాండ్ చేశారు... కేజ్రీవాల్ ఇంటి పై సోదాలు జ‌రిపినందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేతలు అశుతోష్‌, సంజయ్‌ సింగ్‌ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ఆమ్‌ ఆద్మీ ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తీసుకురావ‌డానికి బీజేపీ కుట్ర‌లు చేస్తోంద‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.