అట‌ల్ బిహారీ ల‌వ్ స్టోరీలో న‌మ్మ‌లేని నిజాలు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-08-17 15:45:23

అట‌ల్ బిహారీ ల‌వ్ స్టోరీలో న‌మ్మ‌లేని నిజాలు

మాజీ ప్ర‌ధాన మంత్రి అట‌ల్ బిహారీ వాజ్ పేయి తాను చ‌దువుకున్న స‌మ‌యంలో ఒక అంద‌మైన ల‌వ్ స్టోరీ ఉంది. 1942లో గ్వాలియ‌ర్ విక్టోరియా అనే క‌ళాశాల‌లో బ్రాహ్మ‌ణి అయిన వాజ్ పేయికి ఒక అంద‌మైన కుటుంబాన్ని ఇచ్చింది.  ఆమె పేరు రాజ్ కుమారి. క‌ళాశాల‌లో చ‌దువుకున్న స‌మ‌యంలో వీరిద్ద‌రు కాలేజ్ ఆవ‌ర‌ణ‌లో క‌లుసుకునే వారు. ఏకాతంగా కాలేజీ ఆవ‌ర‌ణ‌లో గంట‌లు గంట‌లు గ‌డ‌ప‌డం, కాలేజ్ లో క‌లిసి తిర‌గ‌డం లాంటివి చేశారు. అంతేకాదు వాజ్ పేయి, రాజ్ కుమారి ఇద్ద‌రు క‌లిసి కాలేజ్ లో ఉన్న లైబ్రెరికి వెళ్లేవారు. క్లాస్ రూమ్ లో కానీ లైబ్రెరిలో కానీ దూరం దూరంగా ఉండి క‌ళ్ల‌తో మాట్లాడేవారు. 
 
ఇక వాజ్ పేయి ఒక అడుగు ముందుకు వేసి రాజ్ కుమారిని జీవిత భాగ‌స్వామిని చేసుకోవాల‌ని భావించి త‌న‌లో ఉన్న ప్రేమ‌ను చెప్పాల‌నే ఉద్దేశంతో ఓ ప్రేమ లేఖ‌ను పుస్త‌కంలో పెట్టి దాన్ని రాజ్ కుమారికి అందించారు. కానీ ఆప్రేమ లేఖ‌ను రాజ్ కుమారి చూసినా కూడా ఆమె నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. దీంతో వాజ్ పేయి ఆ లేఖ‌ను రాజ్ కుమారి చూడ‌లేద‌ని భావించారు. కానీ వాస్త‌వానికి రాజ్ కుమారి ఆ లేఖను చూసి తిరిగి స‌మాధానం కూడా లేఖ రూపంలో రాసి అదే పుస్త‌కంలో పెట్టింది. 
 
కానీ ఆ లేఖ‌ను రాజ్ కుమారి ఆ పుస్త‌కాన్ని వాజ్ పేయికి అందించ‌లేదు. ఇక వ్య‌క్తిగ‌త కార‌ణాల‌వ‌ల్ల ఆయ‌న ఢిల్లీకి చేరుకున్నారు. ఆ త‌ర్వాత రాజ్ కుమారి త‌న ప్రేమ విష‌యాన్ని త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పినా కూడా వారి ప్రేమ‌ను అంగీక‌రించ‌లేదు. వాస్త‌వానికి వీరిద్ద‌రి బ్రాహ్మ‌ణ కుల‌స్తులే అయినా  గోత్రాలు వేరు కావ‌డంతో రాజ్ కుమారి తల్లిదండ్ర‌లు ఒప్పుకోలేదు. 
 
దీంతో త‌ల్లిదండ్రుల‌ను ఎదిరించ‌లేక పెద్ద‌లు చెప్పిన  బ్ర‌జ్ నారామ‌ణ్ కౌల్ అనే కాలేజీ లెక్చ‌ర‌ర్ ను వివాహం చేసుకుంది. ఇక త‌న ప్రేమ విఫ‌లం అయింద‌ని బాధ‌తో వాజ్ పేయి పూర్తిగా బ్ర‌హ్మ‌చారిగా మారి త‌న జీవితాన్ని రాజ‌కీయాల‌కు అంకితం చేశారు. అయితే కొన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత రాజ్ కుమారిని వాజ్ పేయి ఢిల్లీలో క‌లుసుకున్నారు. 
 
ఢిల్లీ యూనివ‌ర్సిటిలో రాజ్ కుమారి భర్త‌ త‌త్త్వ‌శాస్త్ర అధ్యాప‌కులుగా చేశారు. అక్క‌డికి భార్యా భ‌ర్త‌లు ఇద్ద‌రు వాజ్ పేయిని క‌లిసేవారు. దీంతో రాజ్ కుమారి భ‌ర్త‌కు వాజ్ పేయికి స్పేహ బంధం మ‌రింత పెరుగ‌డంతో త‌రుచు కలుస్తూ ఉండేవారు. కౌల్, రాజ్ కుమారి దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్లలు, స‌మిత న‌మ్ర‌త కొన్ని రోజుల‌కు రాజ్ కుమారి భ‌ర్త చ‌నిపోవ‌డంతో ఆమెను అధికార నివాసానికి మ‌కాం మార్చారు. అంతేకాదు ఆమె ఇద్ద‌రి కుమార్తెల‌లో ఒక‌రిని ద‌త్త‌త కూడా తీసుకున్నారు వాజ్ పేయి. ద‌త్త‌త తీసుకున్న కుమార్తె అంటే వాజ్ పేయికి ఎన‌లేని ప్రేమ‌. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.