బ్రేకింగ్.. కాంగ్రెస్ లోకి బీజేపీ మాజీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

congress and bjp
Updated:  2018-09-08 05:51:46

బ్రేకింగ్.. కాంగ్రెస్ లోకి బీజేపీ మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నే క‌స‌ర‌త్తు చేస్తున్న నేప‌థ్యంలో ఇత‌ర పార్టీల‌కు చెందిన కీల‌క నాయ‌కులు త‌మ రాజ‌కీయ‌ భ‌విష్య‌త్ దృష్టిలో ఉంచుకుని అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల్లోకి చేరుతున్నారు. అయితే ఇదే క్ర‌మంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ ఎమ్మెల్యే నందీశ్వ‌ర్ గౌడ్ త్వ‌ర‌లో ఆ పార్టీ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు 
 
ఈ నేప‌థ్యంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కుంతియ, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, ష‌బ్బీర్ అలీల‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ అయిన త‌ర్వాత రెండు లేద మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోనున్నారు నందీశ్వ‌ర్ గౌడ్. ఇక ఈయ‌న చేరిన త‌ర్వాత ఇత‌ర పార్టీ చెందిన మ‌రికొంద‌రు  కీల‌కనేత‌లు కాంగ్రెస్ పార్టీ తీర్ధం తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. అంతేకాదు నందీశ్వ‌ర్ గౌడ్ ను కాంగ్రెస్ త‌రుపున‌ ప‌ఠాన్ చెరువు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయిస్తార‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.