బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

bjp mla rajasingh
Updated:  2018-08-21 10:43:26

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

హైద‌రాబాద్ గోశ‌మ‌హాల్ నియోజ‌క‌వ‌ర్గ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. గోవుల‌ను ర‌క్షించాలంటూ రాజాసింగ్ భ‌షీర్ భాగ్ లోని పోలీస్ క‌మీష‌న‌ర్ ఆఫీస్ ఎదుట దీక్ష‌కు సిద్ద‌మ‌య్యారు. అయితే ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను ఆరెస్ట్ చేశారు పోలీస్ అధికారులు. తాను గోవుల‌ను ర‌క్షిస్తూ ఉంటే త‌న‌పై అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని రాజాసింగ్  ఆరోపించారు. 
 
నిన్న ఆయ‌న గో ర‌క్ష‌ణ కోసం క‌మీష‌న‌ర్ ఆఫీస్ ఎదుట ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే ఆయ‌న ఈ రోజు ప్ర‌క‌ట‌న మేర‌కు క‌మీష‌న‌ర్ ఆఫీస్ ఎదుట చేరుకోగానే అల‌ర్ట్ అయిన పోలీస్ అధికారులు భ‌ద్ర‌త చ‌ర్య‌ల రిత్య ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. త‌న‌ను పోలీసులు అరెస్ట్ చేసినా స‌రే తాను ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తాన‌ని రాజాసింగ్ మీడియా ద్వారా స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.