కేంద్రం పై బాబు వ్యూహాం ప‌నిచేస్తుందా ?

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

chandrababu bjp image
Updated:  2018-03-01 06:12:32

కేంద్రం పై బాబు వ్యూహాం ప‌నిచేస్తుందా ?

2018 కేంద్రబడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది అంటూ అధికార TDP కేంద్రంపై నిరసన ప్రారంభించి అంతిమంగా BJP కి రాజకీయంగా దూరం కావాలనే వ్యూహంగా కనిపిస్తోంది... రాజకీయాలలో ఆచితూచి అడుగులు వేసే బాబుగారు నేడు ఒక్క సారిగా తీవ్ర స్వరం వినిపించడానికి కారణం రాష్ట్రానికి కేంద్రం తగిన సాయం చేయకపోవడం మాత్రమే అనుకుంటే పొరబాటు. 2019 ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలో భాగంగానే కేంద్రంపై నిరసనగళం వినిపిస్తున్నట్లుగా లోతుగా ఆలోచిస్తే  అనిపిస్తుంది.... 3 అంశాలు ఆధారంగా TDP కేంద్రంలోని BJP కి రాజకీయంగా దూరం అవ్వాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తుంది.
 
ప్రధాన మీడియా స్రవంతి ఉత్తరప్రదేశ్ గెలుపును మాత్రమే చూపి దేశవ్యాప్తంగా  జరుగుతున్న రాజకీయ పరిణామాలను పెద్దగా పట్టించుకోకపోవడం వలన మార్పు ఏపి ప్రజలకు నేడు కనిపించక పోవచ్చు కానీ, రాజకీయ అనుభ‌వం ఉన్న బాబుకు ఆ విషయం పసిగట్టడం పెద్ద విషయం కాదు.... 2014 లో దేశంలో BJP పెద్ద విజయం నమోదు చేసుకోవడానికి రెండు కారణాలు. 1 అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్  పై వ్యతిరేకత, 2 గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ  పై ఉన్న ఆశలు. 2019 ఎన్నికలనాటికి గత కాంగ్రెస్ పాల‌న పై అనుకూల‌త లేక‌పోయినా ఆ నాటి వ్యతిరేకత ఉండదు
 
అలాగే మోదీ  పై ఆశలు దేశానికి ప్రధాని కావడానికి ముందు ఉన్న స్దితి ఏకోణంలో చూసినా నేడు లేదు. నోట్ల రద్దు. జీ యస్ టీ ల వలన అనుకూలత కన్నా వ్యతిరేకతే ఎక్కువ. ఇక లెక్కలను కూడా పరిశీలిస్తే,. BJP దేశంలో ఏకపక్ష విజయం కనిపిస్తున్నప్పటికి వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, రాజ‌స్దాన్, మధ్య‌ప్రదేశ్, మహరాష్ట్ర, బీహర్, డిల్లీ, గుజరాత్ లాంటి 7 రాష్ట్రాలలో ఆ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసుకుంది.
 
తాను సాధించిన  మొత్తం 282 స్దానాలలో 201 స్దానాలు కేవలం పై ఏడు రాష్ట్రాలలోనే. అదే సందర్బంలో 143 స్దానాలు ఉన్న బెంగాల్, తమిళనాడు,కేరళ, ఉభ‌య తెలుగు రాష్ట్రాలలో గతానికి ఇప్పటికి BJP కి వచ్చే 1,2 స్దానాలలో పెద్దమార్పు ఏమీ ఉండక పోవచ్చు. మిగిలిన దేశంలోని కర్నాటక గోవా తదితర రాష్ట్రాలలో గతంలో కూడా మంచి స్దానాలను ఆ పార్టీ సాధించింది. పంజాబ్ లో కాంగ్రెస్ మంచి స్దితిలో ఉంది.
 
మొత్తంగా పరిశీలిస్తే  BJP 7 రాష్ట్రాలలో గతంలో సాధించిన ఏక పక్ష విజయం 2014 లో  వారికి కలిసి వస్తే  2019కి  విజయమే ప్రతికూలంగా మారే పరిస్దితులు కనిపిస్తున్నాయి. డిల్లీ, బీహర్, రాష్ట్రాలలో 2014 తర్వాత జరిగిన ఎన్నికలలో ఓడిపోయింది.... గుజరాత్ లో 26 కు 26 స్దానాలు గెలిచిన ఆ పార్టీ నేడు కనీసం 10 కి పైగా స్దానాలు కోల్పోయే స్దితి వచ్చింది. మధ్య‌ప్ర‌దేశ్, రాజస్దాన్ లో 2014 తర్వాత జరిగిన అన్ని రకాల ఎన్నికలలో కాంగ్రెస్  పై చేయిని సాధించింది. 
 
మహరాష్ట్రాలో  అధికార పార్టీపై వ్యతిరేకత తో పాటూ మిత్రపక్ష శివసేన దూరం అయ్యే పరిస్దితి కొంత ప్రతిబంధ‌కమే. ఒక్క ఉత్తరప్రదేశ్ లో మాత్రమే ఇప్పటివరకు గత వాతావరణం కొనసాగుతుండటం, ఆ పార్టీకి కొంత ఊరట కలిగించే అంశం. కానీ అక్కడ జరుగుతున్న వేల సంఖ్యలో శిశుమరణాలు, దేశ వ్యాప్తంగా  కాంగ్రెస్ కొంతమేరకు పుంజుకోవడం లాంటి పరిణామాలు 2014 నాటి ఏకపక్ష విజయం సాధ్యం  కాకపోవచ్చు
 
అలా 2014 లో BJP గెలిచిన 201 స్దానాలలో కనీసం 70 - 80 స్దానాలు వరకు తగ్గే పరిస్దితులు కనిపిస్తున్నాయి. యూపీ పరిస్దితిలో మార్పు వస్తే  మ‌రింత తగ్గుదల ఉండవచ్చు. అలా BJP 70 - 80 స్దానాలు కోల్పోయి 200 లోపుకు వస్తే  కాంగ్రెస్ 44 నుంచి 100 మార్కు దాటే అవకాశం ఉంది...  అలాంటి స్దితిలో డీయంకే, TDP లేదా వై యస్ ఆర్ సీపీ, టీ ఆర్ యస్, మమత, లాలూ, అఖిలేష్  లేదా మాయావతి, నవీన్, వామపక్షాలు కలిపి 200 లోపు సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంది...అప్పుడు కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల కూటమికి అవకాశాలు మెండుగా ఉంటాయి.
 
2014 నాడు రాష్ట్రంలో సగటు ప్రజల జీవన పరిస్దితులు అసలు చర్చకు రాలేదు. కేవలం విడిపోయాం- చెడిపోయాం అన్న అంశం ప్రాతిపదికన ప్రజల ఆలోచనలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం దైర్యాన్ని నూరిపోస్తే, సమైక్య ఉద్యమం పిరికి తనాన్ని నేర్పింది. అదే కేంద్రం సహరిస్తేగాని బ్రతకలేం, ఒక అనుభ‌వం ఉన్న నేత కావాలి. ఈ పరిణామం అప్పటి వరకు మంచి ఊపులో ఉన్న వైసీపీ కి ప్రతిబందకం, అయితే అనుకూల పరిస్దితిలో ఉన్న బాబుగారికి అనుకూలంగా మారింది.
 
నేడు కూడా కేంద్రం పూర్తి  మెజారిటీతో ఉంది ఏమి చేయలేం కనుక తుది వరకు వేచి చూచాం... ఇక చేయగలిగింది ఏమీ లేదు కనుక బయటికి వస్తున్నాం అంటూ కొత్త పల్లవి అందుకోబోతున్నారా అనిపిస్తుంది. ఇప్పటికి  కూడా అర్దం లేకుండా కేంద్రం సహరించకపోతే బ్రతకలేం అన్న మాటలే ప్రజలలో చర్చనీయాంశం చేయడం. ప్రజలలో ఈ విషయంపై అంగీకారం ఉండటం కూడా కొంత కలిసివస్తుంది. మళ్లీ  వచ్చే కేంద్రం అయినా మనకు సాయం చేయాలని  ఆలోచనను ప్రజలలో రేకెత్తిస్తున్నారు. ఎలాగో BJP గెలవదు వచ్చేది ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషించే కూటమిది కనుక ఎక్కవ స్దానాలు గెలిచి కూటమిలో కీలకపాత్ర పోషించి రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కాపాడుకుందాం. అన్న నినాదంతో ముందుకు వెల్లే వ్యూహంగా కనిపిస్తుంది.
 
!! 2019 ఎన్నికలలో తన పాలనా అంశాలు చర్చకు రాకుండా జాగ్రత్త పడటం !!
 
2019 ఎన్నికలలో కచ్చితంగా 2014 నాడు బాబుగారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, బాబుగారి పాలన ప్రాతిపదికన చర్చ జరగాలి. కేంద్రం చేసిన సాయం కూడా ప్రధానమే కాని రాష్ట్రప్రభుత్వం పాత్ర కీలకం. కాని బాబు గారు ఎందుకో గాని తన పాలనా అంశాలపై చర్చ ప్రాతిపదికన ఎన్నికలకు వెళ్ల‌డానికి సిద్దంగా లేరు అనిపిస్తోంది. గతంలో నంద్యాలలో జరిగిన ఎన్నికలలో కూడా తన ప్రధాన లక్ష్యాలైన పోలవరం, రాజధాని లాంటి విషయాలు అదే విదంగా బుణమాఫీ, నిరుద్యోగబృతి లాంటివి కనీసం ప్రస్తావించకుండా, రెండు నెలలకు ముందు ప్రారంబించిన అబివృద్ది ఫదకాలనే చర్చకు పెట్టినారు ఫ‌లితం సాదించారు. 
 
కానీ అలాంటి వ్యూహం రాష్ట్రం మొత్తం సాధ్యం కాదు. కనుక తానూ అద్బుతం చేస్తానన్న అమరావతి, పోలవరం, లక్షల కోట్లు పెట్టుబడులు 2019 నాటికి ప్రాధ‌మిక స్దాయిలో కూడా ఉండవు. అందుకే మరో మారు సెంటి మెంట్ రాజకీయం అందుకున్నారు. తన అజెండాలు చర్చకు రాకుండా చూడటంతో పాటు, ప్రతిపక్షం ప్రస్తావిస్తే  కేంద్రం ఒక వైపు ఇంత అన్యాయం చేస్తుంటే కలిసి పోరాడాల్సింది పోయి రాజకీయం చేస్దారా అంటూ ఎదురు దాడి చేయవచ్చు. అలా 2019 ఎన్నికలలో తన అజెండాల ప్రస్దావన లేకుండా 2014 నాటి సెంటి మెంట్ రాజకీయాలతోనే 2019 ఎన్నికలకు బాబు సిద్దపడుతున్నారు. బాబుగారి వ్యూహం ఫ‌లించడం కేవలం వారిమీద మాత్రమే ఆదారపడి ఉండదు. దాన్ని ప్రతిపక్షం ఎలా ఎదుర్కొంటుంది అనే దానిపై ఆధార‌పడి ఉంటుంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.