ఢిల్లీలో బాబు ప్రెస్ మీట్ హైలెట్స్

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-01-20 09:33:25

ఢిల్లీలో బాబు ప్రెస్ మీట్ హైలెట్స్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లి ప‌ర్య‌ట‌న‌పై రాజ‌కీయ నాయ‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది. శుక్ర‌వారం నాడు చంద్ర‌బాబు , ప్ర‌ధాని  న‌రేంద్ర‌మోదీని క‌ల‌వ‌రం జ‌రిగింది. మోదీ స‌మావేశం అనంత‌రం  చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడ‌టం జ‌రిగింది. 

ప్ర‌స్తుతం ఏపీలో రూ.42 వేల కోట్ల రెవిన్యూ లోటు ఉంద‌ని 14 ఆర్ధిక సంఘం పేర్కొన్న‌ట్లు  చంద్ర‌బాబు మీడియాకు తెలిపారు.  రెవిన్యూ లోటు రూ. 3,979 కోట్లు  మాత్ర‌మే ఇచ్చార‌ని, అమ‌రావ‌తి నిర్మాణానికి రూ.2,500 కోట్లు, విజ‌య‌వాడ‌, గుంటూరు అభివౄద్దికి రూ.1,000 కోట్లు, 13 వ షెడ్యూల్ లోని విద్యా సంస్ధ‌ల నిర్మాణానికి రూ.11 వేల కోట్ల‌కు గానూ, రూ. 460 కోట్లు ఇచ్చార‌ని  చంద్ర‌బాబు తెలిపారు. 

హేతుబ‌ధ్ద‌త లేకుండా రాష్ట్రాన్ని విభజించ‌డం కార‌ణంగానే ఈ స‌మ‌స్య‌లు ఏర్ప‌డ్డాయ‌ని చంద్రబాబు  అన్నారు. రాజ‌ధాని నిర్మాణానికి స‌హ‌క‌రించాల‌ని, దుగిరాజ‌ప‌ట్నం పూర్తి చేయాల‌ని, రైల్వే జోన్, నియోజ‌క‌వ‌ర్గాల  పునర్విభ‌జ‌న  అంశాల‌ను  త్వ‌ర‌గా తేల్చాల‌ని,  మోదీని కోరిన‌ట్లు తెలిపారు. 

హోదాలో అన్ని అంశాల‌ను ప్యాకేజీలో ఇస్తామ‌ని ఆర్ధిక‌మంత్రి అరుణ్ జైట్లీ చెప్పార‌ని, దీంతో ప్ర‌త్యేక ప్యాకేజీలోని అన్నింటిని  వెంట‌నే ఇవ్వాల‌ని మోదీని చంద్ర‌బాబు కోరారు. విభ‌జ‌న హామీల అమలు కోసం టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు  చేయాల‌ని చంద్ర‌బాబు మోదీని కోరటం జ‌రిగింది. ఈఏపీ కింద ఇవ్వాల్సిన రూ.16 వేల కోట్ల‌ను ఇప్పించాల‌ని  కూడా కోరారు.  పోల‌వ‌రానికి ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 12 వేల కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని పోల‌వ‌రంలో 73 శాతం ఎర్త్ వ‌ర్క్ పూర్త‌యిందని చంద్ర‌బాబు తెలిపారు. 

ఇక కేంద్రాన్ని నాకంటే ఎవ‌రు గ‌ట్టిగా అడుగుతార‌ని, రాష్ట్రం కోసం రాజీనామా చేస్తామ‌ని ప్ర‌కటించిన వైసీపీ  ఏం చేసింద‌ని ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంద‌నేది చూడాలి. మ‌రో వైపు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా దిల్లీ ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని అనుకున్నారు. అయితే ఇంకా చంద్ర‌బాబు స‌మ‌స్య‌ల‌ను వివ‌రించే ద‌శ‌లోనే ఉన్నార‌ని పలువురు ఎద్దేవా చేశారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.