కేంద్రంపై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-01-20 09:49:30

కేంద్రంపై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీతో స‌మావేశం అయిన సంగతి అంద‌రీకి తెలిసిందే. పోల‌వ‌రం  ప్రాజెక్టు నిర్మాణంతోపాటు విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను నెర‌వేర్చాల‌ని చంద్ర‌బాబు మోదీని కోర‌టం  జ‌రిగింది. 

అంతేకాకుండా మ‌రోసారి  ప్ర‌ధాని మోదీతో భేటీ అయ్యేందుకు కూడా చంద్ర‌బాబు  నాయుడు ముహూర్తం ఖ‌రారు చేసుకున్నారు. ఈ క్రమంలో  శుక్ర‌వారం నాడు  ఏర్పాటు చేసిన క‌లెక్ట‌ర్ల కాన్ఫ‌రెన్స్ లో కేంద్ర ప్ర‌భుత్వంపై సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  చేయ‌డం గ‌మ‌నార్హం. 

కేంద్ర సాయం విష‌యంలో రాజీప‌డేది లేద‌న్న చంద్ర‌బాబు.... అవ‌స‌ర‌మైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ‌తానంటూ ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లు వార్త‌లు రావ‌డం  ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇత‌ర రాష్ట్రాల‌తో స‌మాన స్ధాయికి వ‌చ్చే వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఏపీని ఆదుకోవాల‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. 

మ‌రోవైపు బుధ‌వారం నాడు ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా తెలంగాణ  ముఖ్య‌మంత్రి కేసిఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను  చంద్రబాబు ఖండించారు. ఏపీతో తెలంగాణ‌కు పోలికే లేద‌ని కేసిఆర్ పేర్కొన‌డం త‌న‌కు బాధ‌నిపించింద‌ని బాబు అన్నారు. ఏపీ ప్ర‌జ‌లేమీ త‌ప్పు చేయ‌లేద‌ని నాటి పాల‌కులు  చేసిన పాపం ఫ‌లితం కార‌ణంగా ఇప్పుడు ఏపీలో ఇలాంటి ప‌రిస్థితులు ఉన్నాయ‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.