చిదంబ‌రం కుమారుడు అరెస్ట్

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-02-28 11:34:51

చిదంబ‌రం కుమారుడు అరెస్ట్

కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి చింద‌బ‌రం కు ఈ రోజు ఉద‌యాన్నే షాక్ త‌గిలింది... ఆయ‌న కుమారుడు కార్తి చిదంబ‌రాన్ని ఐఎఫ్ఎక్స్ మీడియా స్కామ్ నేప‌థ్యంలో నేడు ఆయ‌న‌ను  సీబీఐ అరెస్ట్ చేసింది... యూపీఏ హ‌యాంలో మంత్రిగా ఉన్న‌ప్పుడు ఐఎఫ్ఎక్స్ మీడియా అక్ర‌మ స్కామ్ చోటు చేసుకుంది...
 
2007 సంవ‌త్స‌రం  మీడియా నిధులు పొందే వీలుగా అనుమ‌తిని మంజూరు చేసింది... అయితే  ఈ విచార‌ణ  నేప‌థ్యంలో విదేశాల నుంచి తిరిగి వ‌స్తున్న  కార్తిని చెన్నై విమానాశ్ర‌యంలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.. విచార‌ణ నిమిత్తం తిరిగి ఢిల్లీకి తీసుకువెళ్లే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.
 
అయితే మ‌రో వైపు కార్తి చిదంబ‌రానికి చెందిన చార్ట‌ర్డ్ అకౌంటెంట్  భాస్క‌ర్ రామ‌న్ ను  కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు... ఈ విచార‌ణ అనంత‌రం ఆయ‌న‌ను న్యాయ‌స్థానం ముందు హాజరు ప‌ర‌చ‌నున్నారు... దీంతో పాటు  ఐఎఫ్ఎక్స్ మీడియా డైరెక్టర్లు - పీటర్, ఇంద్రాణి ముఖర్జీలతో సహా  నిందితులపై  ఎఫ్ ఐ ఆర్  నమోదు చేసిన సంగతి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.