కాంగ్రెస్ - జేడీఎస్ విజ‌యం

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

congress-jds
Updated:  2018-05-25 05:46:09

కాంగ్రెస్ - జేడీఎస్ విజ‌యం

దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిరేపిన క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ఎట్ట‌కేల‌కు జాతీయ కాంగ్రెస్, పార్టీ జేడీఎస్ లు క‌లిసి క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకున్న‌సంగ‌తి తెలిసిందే. ఇక ఈ రోజు క‌ర్ణాట‌క‌ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వ‌హించారు. ఈ బ‌ల‌ప‌రీక్ష‌లో కుమార స్వామి నెగ్గ‌లంటే మ్యాజిక్ ఫిగర్ 111ను సాధించాలి. అయితే ఆయ‌న 117 మంది స‌భ్య‌లు మ‌ద్ద‌తు తెలుప‌డంతో  బలపరీక్షలో కుమారస్వామి గెలుపొందారు.
 
ఈ బ‌ల‌ప‌రీక్ష‌లో బీజేపీ నాయ‌కులంతా వాకౌట్ అయ్యారు. ఈ నేపథ్యంలో సభలో మిగిలిపోయిన జేడీఎస్, కాంగ్రెస్ సభ్యులంతా బలపరీక్షకు మద్దతుగా చేతులు ఎత్తారు. అలాగే బలపరీక్షకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ చేతులు లేపలేదు.
 
దీంతో, బలపరీక్షలో కుమారస్వామి నెగ్గినట్టు స్పీకర్ మూడు సార్లు చవివి వినిపించారు.ఆ తర్వాత జాతీయగీతంతో సభను స్పీకర్ ముగించారు. అనంతరం కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.