జ‌గ్గారెడ్డి అరెస్ట్

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

jagga reddy
Updated:  2018-09-11 10:56:42

జ‌గ్గారెడ్డి అరెస్ట్

భార్యా,పిల్లల‌ పేరుతో వేరే వ్య‌క్తుల‌ను అమెరికాకు తీసుకువెళ్లార‌న్న ఆరోప‌ణ‌లతో అరెస్ట్ అయిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత‌ జ‌గ్గారెడ్డిని సికింద్రాబాద్ కోర్డులో ఈ రోజు హాజ‌రు ప‌రిచారు. ఈ ఉద‌యం గాంధీ ఆసుప‌త్రిలో ఆయ‌న‌కు చికిత్స‌లు చేసిన త‌ర్వాత నార్థ్ జోన్ డీసీపీ కార్యాలయానికి త‌ర‌లించారు. సుమారు 14 సంవ‌త్స‌రాల క్రితం జ‌గ్గారెడ్డి త‌న భార్యా పిల్లల‌ పేర్ల‌తో పాస్ పోర్ట్ లు తీసుకుని అమెరికాకు తీసుకువెళ్లి తిరిగి ఒక్క‌రే వ‌చ్చార‌ని సికింద్రాబాద్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. 
 
ఇక దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు జ‌గ్గారెడ్డి అమెరికా వెళ్లిన‌ప్పుడు త‌న భార్యా పిల్లల‌ స్థానంలో గుజ‌రాత్ కు చెందిన యువ‌తితో పాటు ఇద్ద‌రు పిల్ల‌ల‌ను వ‌దిలేసి వ‌చ్చార‌ని గుర్తించారు. దీంతో ఆయ‌న‌పై మాన‌వ అక్ర‌మ ర‌వాణ కేసును న‌మోదు చేసి ఆయ‌న‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
అయితే ఈ కేసుతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని కావాల‌నే త‌న‌ను రాజ‌కీయంగా త‌న‌పై కుట్ర‌ప‌న్నుతున్నార‌ని జ‌గ్గారెడ్డి ఆరోపించారు. ఇక మ‌రో వైపు జ‌గ్గారెడ్డి అరెస్ట్ కు నిర‌స‌న‌గా సంగారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు, ఆయ‌న అభిమానులు నేడు బంద్ కు పిలుపునిచ్చారు.

షేర్ :