నన్ను ఆ కాంగ్రెస్ నేత లైంగికంగా వేధించాడు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

congress
Updated:  2018-10-09 12:45:36

నన్ను ఆ కాంగ్రెస్ నేత లైంగికంగా వేధించాడు

లైంగిక దాడుల‌కు వ్య‌తిరేకంగా మ‌హిళ‌ల మీటూ ఉద్య‌మం ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారుతోంది. చిత్ర‌పరిశ్ర‌మ‌ల‌కు చెందిన హీరోయిన్లు గ‌తంలో త‌మ‌కు ఎదురైన లైంగిక చేదు అనుభ‌వాన్ని సోష‌ల్ మీడియా వేదికగా చేసుకుని ట్వీట్ చేస్తున్నారు. ఇక ఈ ఉద్య‌మం కాస్త తాజాగా కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తుంది. బాలీవుండ్ నుంచి  మీడియా వ‌ర‌కు వివిధ సంస్థల్లో లైంగిక దాడులు జ‌రిగాయంటూ అనేక మంది బాధితులు మీటూ పేరుతో సోష‌ల్ మీడియాలో ప్ర‌కంప‌న‌లు స్రృష్టిస్తున్నారు. 
 
అయితే ఇదే త‌ర‌హా ఆరోప‌ణ‌లు కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను తాకాయి. కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా సెల్లో ప‌ని చేస్తున్న చిరాక్ ప‌ట్నాయ‌క్ త‌నతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ మాజీ ఉద్యోగి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఇక ఈ విష‌యాన్ని కాంగ్రెస్ ఐటీ సెల్ ఉద్యోగి దివ్య స్పంద‌న దృష్టికి తీసుకువెళ్లినా త‌న‌కు న్యాయం జ‌రుగ‌లేద‌ని బాధితురాలు ఆరోపిస్తోంది.
 
దీంతో చిరాక్ ప‌ట్నాయ‌క్ వ్య‌తిరేకంగా బాధితురాలు న్యాయ పోట‌రం చేప‌ట్టింది. సాటి మ‌హిళ‌గా సోష‌ల్ మీడియా హెడ్ గా త‌న‌కు అండ‌గా నివాల్సిన దివ్య స్పంద‌న అలియాస్ ర‌మ్య త‌న‌ను ఘోరంగా అవ‌మానించార‌ని బాధితురాలు ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి క‌నీసం నోటీసు ఇవ్వ‌కుండానే త‌న‌ను ఉద్యోగం నుంచి తొల‌గించిన‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. 
 
కాంగ్రెస్ సోష‌ల్ మీడియా విభాగంలో జ‌రుగుతున్న లైంగిక వేధింపుల ఘ‌ట‌న‌పై గ‌తంలో పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాసినా స్పంద‌న రాలేద‌ని బాధితురాలు ఆరోపిస్తోంది. దీంతో చిరాక్ ప‌ట్నాయ‌క్ వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావాల‌ని ఢిల్లీకోర్టు ఆదేశాల‌ను జారీ చేసింది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.