మాజీ ఎంపీ క‌న్నుమూత‌

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-08-18 13:56:49

మాజీ ఎంపీ క‌న్నుమూత‌

మాజీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చెన్నుపాటి విద్య ఈ రోజు తెల్ల‌వారు జామున గుండెపోటుతో మ‌ర‌ణించారు. చెన్నుపాటి విద్య హేతువాది.1934 జూన్‌ 5న జన్మించిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. చెన్నుపాటి శేషగిరి రావును 1950లో వివాహం చేసుకున్నారు. విద్యకు ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇక ఈమె రాజకీయ రంగప్రవేశం ఎలాజ‌రిగిందంటే.. 1974లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభకు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయటానికి విద్య పోటీ చెయ్యాల‌ని అనుకున్నారు. కానీ అప్లికేషన్లో కులం, మతం అనే కాలమ్‌లో నిల్ అని రాయ‌డంతో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున టికెట్టు రాలేదు. 
 
దీనిపై ఆగ్రహించిన విద్య‌ ఈ విషయాన్ని ఇందిరా గాంధీ దృష్టికి తీసుకెళ్తూ కులాలు, మతాలు అవసరం లేని రోజున, ఓ కాంగ్రెస్ కార్యకర్తగా నా సేవలు కావాల్సినపుడు, నన్ను పిలవండి.. అంతవరకూ నేను ఏ పదవి కోసం, టికెట్టు కోసం దరఖాస్తు చేయను అని విద్య‌ లేఖ రాయగా ఆ లేఖ ఇందిరా గాంధీపై బలమైన ముద్ర వేసింది. అలా మాటకు కట్టుబడి ఏ అభ్య‌ర్థి దరఖాస్తు పెట్టలేదుఅప్ప‌ట్లో. 
 
అయితే 1979లో ఓ రాత్రి అకస్మాత్తుగా ఇందిరా గాంధీ స్వయానా ఫోన్ చేసి విజయవాడ ఎంపీ టికెట్ నీకు ఇచ్చాను విద్య గెట్‌రెడీ అని చెప్పగా మేడం ఎంపీగా నేను ఫిట్ అవుతానా అని సందేహం వెలుబుచ్చింది. ఐ థింక్ యూ ఆర్ ది బెస్ట్ ఛాయిస్ అన్న ఇందిరా గాంధీ భరోసాతో పోటీచేసి జనతా పార్టీ అభ్యర్థి కె.ఎల్.రావుపై లక్షపైచిలుకుల ఆధిక్యతతో గెలుపొందింది.ఈమె విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి 1980లో మొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా 7వ లోక్‌సభకు ఎన్నుకోబడింది. తర్వాత మరళ 1989 లో రెండవసారి అదే నియోజకవర్గం నుండి 9వ లోక్‌సభకు ఎన్నుకోబడింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.