రేపే బలనిరూపణ

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-05-18 16:13:48

రేపే బలనిరూపణ

కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో రెండు అతిపెద్ద జాతీయ పార్టీల యుద్ధమే జరిగింది..ఎన్నికలకు ముందు మేమంటే మేమె అధికారాన్ని దక్కించుకుంటామని ధీమాగా ఉన్నాయి రెండు పార్టీలు. కానీ జేడిఎస్ మాత్రం మేమె కింగ్ మేకర్ అవుతాము...మా మద్దతు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాలేదు అని నమ్మకంగా ఉంది.జెడిఎస్ఊహించినట్లుగానే ఏ పార్టీకి పట్టం కట్టలేదు కన్నడీయులు.
 
ఈ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించి కర్ణాటకలో అతి పెద్ద పార్టీగా అవతరించగా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ 78 స్థానాలతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక కింగ్ మేకర్ అవుదామనుకున్న జెడిఎస్ 38 స్థానాల్లో విజయం సాధించింది...
 
కాంగ్రెస్, జెడిఎస్ కి మద్దుతు ప్రకటించడంతో అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్నజెడిఎస్ శతవిధాలా ప్రయతించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది... బీజేపీ సరైన సమయంలో పావులు కదిలించడంతో జెడిఎస్, కాంగ్రెస్ కి షాకిచ్చి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంఖ్యా బలం లేకపోయినా అధికార పీఠాన్ని దక్కించుకుంది.
 
కర్ణాటక గవర్నర్ అధికారాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి అవకాశం ఇవ్వడంతో, యడ్యూరప్ప ఏ హంగు, ఆర్భాటాలు లేకుండా కేవలం అయిదు నిముషాలలోనే  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని ముగించారు..ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కర్ణాటక గవర్నర్ అనైతికంగా వ్యవహరించారంటూ కాంగ్రెస్‌-జేడీఎస్‌లు పిటిషన్ దాఖలు చేశాయి.
 
కాంగ్రెస్‌-జేడీఎస్‌, బీజేపీ వాదనలు విన్న ముగ్గురు న్యాయమూర్తులతో కలిసిన ధర్మాసనం తన అభిప్రాయాన్ని వెల్లడించింది...బీజేపీ రేపు బలనిరూపణ చేస్తే బాగుంటుందని చెప్పింది ధర్మాసనం...ఇది ఇలా ఉంటే కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి..కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోని రెండు హోటళ్లలో బస చేస్తున్నారని సమాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.