క‌రుణానిధి అంత్య‌క్రియ‌లు ఆయ‌న ప్ర‌క్క‌నే

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

karunanidhi
Updated:  2018-08-08 14:07:51

క‌రుణానిధి అంత్య‌క్రియ‌లు ఆయ‌న ప్ర‌క్క‌నే

మాజీ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి డీఎంకే అధినేత క‌రుణానిధి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించే  స్థ‌లంపై నెల‌కొన్న ప్ర‌తిస్తంబ‌న‌కు తెర‌ప‌డింది. మెరీనా బీచ్‌లో అంత్య‌క్రియ‌ల‌కు మ‌ద్రాస్ హైకోర్టు అంగీక‌రించింది. అన్న‌దురై స‌మాధి ప‌క్క‌నే క‌రుణానిధిని స‌మాధి చేసేందుకు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. 
 
మెరీనా బీచ్ లో అత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ డీఎంకే నాయ‌క‌త్వం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాన్ని కోరింది. అన్నాదురై స‌మాధి ప్ర‌క్క‌నే క‌రుణానిధిని స‌మాధి చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. అయితే ఈ విజ్ఞ‌ప్తిపై స్పందించిన త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం మెరీనా బీచ్ లో క‌రుణానిధి అంత్య‌క్రియ‌ల‌కు స్థ‌లం కేటాయించ‌లేమ‌ని తెలిపింది.ప‌ర్యావ‌ర‌ణాల కార‌ణాల దృష్ట్యా అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని పేర్కొంది.
 
మెరీనా బీచ్ లో స్మార‌క చిహ్నాల నిర్మాణాల‌ను వ్య‌తిరేకిస్తూ హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయ‌ని అందువ‌ల్ల అనుమ‌తి ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని వివ‌రించింది. దీంతో డీఎంకే నాయ‌క‌త్వం మ‌ద్రాస్ హైకోర్టును ఆస్ర‌యించింది. 
 
నిన్న రాత్రి సుమారు 10.30 నిమిషాల‌కు హైకోర్ట్ న్యాయ‌మూర్తి నివాసంలో సుదీర్ఘ విచార‌ణ జ‌రిగింది. అయితే ఈ క్ర‌మంలో జేఎస్ స్మారక నిర్మాణంపై కేసువేసిన న్యాయ వాదులు బాలుదురై స్వామిలు త‌మ పిటీష‌న్ల‌ను వెన‌క్కి తీసుకున్నారు. ఆ త‌ర్వాత  మ‌రో రెండు పిటీష‌న్ల‌ను కూడా వెన‌క్కి తీసుకున్నారు. అయితే సామాజిక కార్య‌క‌ర్త ట్రాఫిక్ రామ‌స్వామి మాత్రం త‌న పిటీష‌న్ వెన‌క్కి తీసుకునేందుకు స‌సేమిరా అన్నారు.
 
దీంతో విచార‌ణ ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు వాయిదా వేశారు. అయితే 8 గంట‌ల‌కు విచార‌ణ మొద‌లు అవ్వ‌గా తాను దాఖ‌లు చేసిన పిటీష‌న్ ఉప సంహరించుకుంటున్న‌ట్లు ట్రాఫిక్ రామ‌స్వామి తెలిపారు. దీంతో ఈ వివాదానికి తెర‌ప‌డింది. దీంతో కోర్టు క‌రుణానిధి అంత్య‌క్రియ‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో పార్టీ కార్య‌క‌ర్త‌లు అభిమానులు హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.