ష‌మీ అక్ర‌మ సంబంధం గుట్టుర‌ట్టు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

indian cricketer shami image
Updated:  2018-03-07 05:21:29

ష‌మీ అక్ర‌మ సంబంధం గుట్టుర‌ట్టు

టీమిండియా పేస్ బౌల‌ర్  మహ్మద్‌ షమీ అక్ర‌మ సంబందాల ఫోటోలు సోష‌ల్ మీడియాలో హల్ చ‌ల్ చేస్తున్నాయి... ఈ ఫోటోల‌ను స్వ‌యానా ష‌మీ భార్య  హాసిన్‌ జాహన్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం... ఈ విష‌యంపై ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ ల్లో  హాసిన్‌ మాట్లాడుతూ  త‌న‌కు తెలియ‌కుండా ష‌మీ అనేక మంది అమ్మాయిల‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నార‌ని. ఈ విష‌యం త‌న‌కు తెలియ‌కుండా చాలా కాలంగా దాచార‌ని తెలిపింది... తన కోసం కాక పోయినా త‌న‌కు పుట్టిన పాప కోస‌మైనా మారతాడ‌ని భావించి ఈ విష‌యాన్ని ఇంత‌కాలం బ‌య‌ట పెట్టలేద‌ని, చివ‌రికి అత‌ను మార‌డ‌నే తెలిసి ష‌మీ అక్ర‌మ సంబంధాన్ని బ‌య‌ట పెట్టాన‌ని మీడియాతో తెలిపారు హాసిన్‌ జాహన్.
 
2014 లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఫ్రాంచైజీ బహుమతిగా ఇచ్చిన మొబైల్లో ఈ ఫోటోలు ఉన్నాయ‌ని, ఈ మొబైల్ ఎవ‌రికి తెలియ‌కుండా త‌న కారులో భ‌ద్రంగా దాచుకున్నార‌ని  హాసిన్‌ జాహన్ తెలిపారు... కాగా తాను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన‌ది కొన్ని ఫోటోలేన‌ని అనేక మంది అమ్మాయిల‌తో ష‌మీ అక్ర‌మ సంబంధాలు పెట్టుకున్నార‌ని ఆమె వెల్ల‌డించింది.
 
అంతేకాదు అతని కుటుంబసభ్యులు త‌న‌ని చంపేందుకు కూడా ప్ర‌య‌త్నించార‌ని హాసిన్‌ జాహన్ తెలిపారు. షమీ కుటుంబంలోని అందరూ తనను టార్చర్ పెట్టారని ఆరోపించారు... అత‌ని తల్లి, సోదరుడు తనను  ఉదయం 2 గంటల నుంచి టార్చర్ చేస్తార‌ని, చాలా సార్లు న‌న్ను చంపేందుకు కూడా ప్ర‌యత్నించారని హాసిన్‌ జాహన్  తెలిపారు... ష‌మీ కుటుంబ స‌భ్యులు ఎంత టార్చ‌ర్ పెట్టినా త‌న కూతురు కోసం భ‌రించాన‌ని, కానీ ఆయ‌న అక్ర‌మ సంబంధం తెలియ‌గానే భ‌రించ‌లేక పోయాన‌ని ఆమె తెలియ‌చేసింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.