యోగి రాష్ట్రంలో మ‌రో దారుణం

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-02-06 05:16:35

యోగి రాష్ట్రంలో మ‌రో దారుణం

భారతదేశంలో అత్యధిక జనాభా గల అతి పెద్ద రాష్ట్రం ఉత్త‌ర్‌ప్ర‌దేశ్. పారిశ్రామికంగా అభివృద్ది చెంద‌డం వ‌ల్ల ఇక్క‌డ అనేక మంది ప్ర‌జ‌లు నివ‌సిస్తున్నారు.. వ‌ర్త‌క, వాణిజ్య రంగాల‌లో ఎంతో పేరు ఉంది యూపీకి... అభివృద్దికి ఆటంకాలు అనేకం.. అలాగే ఇక్క‌డ రాజ‌కీయంగా ఎక్కువ ప్రాబ‌ల్యం ఉన్న రాష్ట్రం యూపీ...ఇక బీహార్ త‌ర్వాత దారుణాలు దాడులు జ‌రుగుతున్న రాష్ట్రంగా యూపీ నిలుస్తోంది.
 
ఇటీవ‌ల ఉన్నావ్ జిల్లా బంగార్మావ్‌లో ఒకేసారి 40 మంది ఎయిడ్స్ బాధితులుగా తేలడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనికి కార‌ణం గ‌త యేడాది ఓ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో . ఆ స‌మ‌యంలో ఇక్క‌డ క్యాంప్‌లో, వైద్యుడి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన రోగులంద‌రికి  ఒకే  ఇంజెక్ష‌న్  వినియోగించ‌డం వ‌ల్ల ఒక‌రి నుంచి మ‌రొక‌రికి ఎయిడ్స్ సోకిన‌ట్లు తేలింది అని అధికారులు అనుమానిస్తున్నారు.
 
ఇప్పుడు తాజాగా 40 మంది మాత్ర‌మే ఎయిడ్స్ బారిన ప‌డ్డారు అని తెలుస్తోంది... కాని ఈ ప్రాంతంలో నివ‌సించే ప్ర‌జ‌లంద‌రికి ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయిస్తే  సుమారు 500 మంది దాకా బ‌య‌ట ప‌డ‌వచ్చ‌ని బంగార్మావ్ కౌన్సిలర్ సునీల్ పేర్కొన్నారు.
 
ఈ ఘ‌ట‌న పై యూపీ ఆరోగ్యమంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడుతూ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాం. ఈ దారుణానికి కారకులైన వారిని  కఠినంగా శిక్షిస్తామ‌ని తెలిపారు. ఇక్క‌డ బీజేపీ పాల‌న‌లో జార్ఖండ్ ఎంజీఎం ఆస్పత్రిలో పౌష్టికాహర లోపంతో 52 మంది చిన్నారులు  చనిపోగా, ఉత్తర ప్రదేశ్ గోర‌ఖ్‌పూర్‌ ఆస్పత్రిలో 60 మంది పిల్లలు మృతి చెందిన విష‌యం తెలిసిందే... అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఇటువంటి దారుణాల‌పై కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు క‌మ‌లం పార్టీని సెంట‌ర్ చేస్తున్నాయి అయితే దీనిపై  సీఎం యోగి సీరియ‌స్ అయ్యార‌ని, ఈ ఘ‌ట‌న పై  ఉన్న‌త అధికారులు క‌మిటీ వేసి, వారికి న్యాయం చేస్తాము  అని అధికారులు అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.