Breaking News

హోమ్        న్యూస్


ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగార

దేశంలో మ‌రో మ‌రోసారి ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది.  ఇటీవ‌ల గుజ‌రాత్‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్  ఎల‌క్ష‌న్‌ల ఫ‌లితాలు రాజ‌కీయంగా ఆస‌క్తిని పెంచాయి. అయితే ఇప్పుడు మ‌రో మూడు రాష్ట్రాల‌కు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈశాన్యంలో ఉన్న మేఘాలయా, త్రిపుర, నాగాలాండ్‌ల‌కు  ఫిబ్రవరిలో శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి అచల్‌ కుమార్‌ జోతి తెలిపారు.

ఫిబ్రవరి 18న త్రిపుర, 27న మేఘాలయా, నాగాలాండ్‌కు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న మూడు రాష్ట్రాల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలన్నీ ఒకే విడతలో‌ జరగనున్నాయి. కేవ‌లం మూడు రాష్ట్రాల్లోను 60 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌డం వ‌ల‌నే ఏక‌కాలంలో నిర్వ‌హిస్తున్నారు.

దీనికి సంబంధించిన షెడ్యూల్  సీఈసీ అచల్‌ కుమార్‌ గురువారం  విడుద‌ల  చేశారు. నేటి నుంచి ఎలక్ష‌న్ కోడ్  అమల్లో

ఉంటుంద‌ని సీఈసీ వెల్ల‌డించారు. ప్ర‌తి  రాష్ట్రంలోను ఈవీఎం, వీవీప్యాట్‌ పరికరాలను ఉపయోగించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్ప‌టికే పూర్తయినట్లు  తెలిపారు.

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.