నిర్భయ తల్లి పై మాజీ డీజీపీ కీల‌క వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

nirbhayas mother image
Updated:  2018-03-16 03:23:24

నిర్భయ తల్లి పై మాజీ డీజీపీ కీల‌క వ్యాఖ్య‌లు

దేశరాజధాని నడిబొడ్డున జరిగిన నిర్భ‌య ఘటన దేశ ప్ర‌జ‌ల‌ను అంద‌రిని ఒకే తాటిపై తీసుకువ‌చ్చింది నింధితుల‌కు శిక్ష అలాగే కొత్త చ‌ట్టాలు తీసుకురావాలి అని దేశంలో పార్టీల‌కు జెండ‌ర్ ల‌కు సంబంధం లేకుండా అంద‌రూ రోడ్ల‌పైకి వ‌చ్చారు.. దీంతో నిర్బ‌య చ‌ట్టం అమ‌లులోకి వ‌చ్చింది అమ్మాయిల‌పై యువ‌తుల‌పై ఎటువంటి దాడులు జ‌రిగినా నిర్భ‌య కేసును ప్ర‌యోగిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటక రిటైర్డ్ డిజీపీ ఒకరు నిర్భయ తల్లి ఆశాదేవిని పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
మ‌హిళ‌ల‌ను స‌న్మానించే కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా కర్ణాటక మాజీ డీజీపీ హెచ్‌టీ సంగ్లియానాను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి నిర్భయ తల్లి ఆశా దేవి కూడా హ‌జ‌ర‌య్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన సంగ్లియానా నిర్బ‌య త‌ల్లి పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.  నిర్భయ తల్లిని చూశాను. ఆమె చక్కగా, అందంగా ఉన్నారు. తల్లే ఇంత అందంగా ఉంటే ఇక నిర్భయ ఎంత అందంగా ఉండేదో నేను ఊహించగలను అని కొన్ని అసంద‌ర్బ వ్యాఖ్య‌లు చేశారు. 
 
అంతేకాకుండా కార్యక్రమానికి వచ్చిన వారికి కొన్ని ఉచిత సలహాలు కూడా ఇచ్చారాయ‌న‌. మీరు ఎంత బలవంతులైనా సరే.. రేపిస్టులకు లొంగిపోవాల్సిందే అని, అలా అయితేనే మీరు మీ జీవితాలు సురక్షితంగా ఉంటాయి, ఈ మాటలు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తాయంటూ వ్యాఖ్యానించారు. క‌న్న కూతురు దూరం అయింద‌న్న బాధ‌ను దిగ‌మింగుకుని స‌మాజం కోసం ప‌ని చేస్తున్న  ఆమె ప‌ట్ల  అనుచిత వ్యాఖ్యలు చేయ‌డాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకించాయి...
 
ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకుని క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మ‌హిళా సంఘాలు  ధర్నా చేపట్టాయి. నిజంగా ప్ర‌భుత్వాల త‌ర‌పున ఉన్న అధికారులు కొంద‌రు ఇలా ఉంటే, ఇక ప్ర‌జ‌లు ఎలా ఉంటారు అని, కాస్త స‌మాజం పై అవ‌గాహ‌న ఉండేలా చేయ‌వల‌సిన వారే ఇలా మాట్లాడితే, ఎలా అని మేధావులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.