క్రికెట్ చరిత్రలోనే సంచలనం.. ఒకే ఓవర్‌లో 77 పరుగులు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-02-20 06:18:10

క్రికెట్ చరిత్రలోనే సంచలనం.. ఒకే ఓవర్‌లో 77 పరుగులు

క్రికెట్‌లో ఒక ఓవ‌ర్‌కు ఆరు బంతులు. ఆరు సిక్సులు కొట్టి 36 ప‌రుగులు రాబ‌ట్ట‌డం సాధ్య‌మ‌ని నిరూపించారు క్రికెటర్లు.. అయితే 18 ఏళ్ల క్రితం ఇదే రోజు ఫిబ్రవరి 20న క్రికెట్ చ‌రిత్ర‌లో  ఓ మరుపురాని సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బౌలర్ బ్రెట్ వేన్స్ ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చి రికార్డు సృష్టించాడు.
 
ఇప్పుడు వెల్లింగ్‌టన్ వేదికగా  జరిగిన మ్యాచ్‌లో బ్రట్ ఒకే ఓవర్‌లో ఏకంగా 77 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొద‌టి ఓవర్ వేసిన‌ బ్రెట్ మొత్తం 17 నోబాల్స్ వేశాడు. ఫ‌లితంగా ప్ర‌త్య‌ర్ది బ్యాట్స్ మెన్ ఐదు సింగిల్స్, ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సులు బాదాడు. బ్యాట్స్‌మెన్ లీ జర్మొన్ ఒకడే 70 పరుగులు చేయ‌డం  విశేషం.
 
ఈ ఓవర్‌లో బ్రెట్ వేసిన బంతుల్లో  ఐదే  స‌రైన‌వి కావడం మరో విశేషం. దీంతో ఈ ఓవర్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప‌రుగులు వ‌చ్చిన  ఓవర్‌గా నిలిచింది. భ‌విష్య‌త్తులో ఇలాంటి రికార్డులు పున‌రావృతం కావ‌డం క‌ష్ట‌మే అని  క్రికెట్ అభిమానులు అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.