వేడెక్కిన క‌ర్ణాట‌క రాజ‌కీయాలు 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

karnataka politics
Updated:  2018-09-21 06:17:37

వేడెక్కిన క‌ర్ణాట‌క రాజ‌కీయాలు 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు

క‌ర్ణాట‌క రాజ‌కీయాలు మ‌ళ్లీకాక రేపుతున్నాయి. కాంగ్రెస్ జేడిఎస్ పార్టీల‌నుంచి సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ముంబాయ్ కు వెళ్లిపోవ‌డం రాష్ట్రంలో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఇన్నాల్లు సైలెంట్ గా ఉన్న బీజేపీ ఇప్పుడు కుర్చిపై కుంప‌టి పెడుతూ వేగంగా పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఒక్కో ఎమ్మెల్యేకు 5 కోట్లు చొప్పున ఎర‌వేసి ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర‌లు ప‌డుతోంద‌ని తాజాగా కుమార స్వామి ఆరోపించారు. 
 
కాంగ్రెస్ లో డీకే శివ‌కుమార్, మంత్రి ర‌మేష్, జ‌ర్కీ హోలీ వ‌ర్గాల‌మ‌ధ్య త‌లెత్తిన పోరు అస‌మ్మ‌తికి దారితీస్తోంది. రెండు పార్టీల్లో మంత్రి ప‌ద‌వులు ద‌క్కిన నేత‌లు తాడోపేడో తేల్చుకుంటామంటూ ముంబాయ్ నుంచి క‌థ న‌డిపిస్తున్నారు. కుమార స్వామి ఆరోపించిన‌ట్లే బీజేపీ వేగంగా పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిందుకు ఆహ్వానించాల్సిందిగా గ‌వ‌ర్న‌ర్ విన‌తిప‌త్రాన్ని అందిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. 
 
బీజేపీ సీనియ‌ర్ నేత ఎడ్యూర‌ప్ప తెర వెనుక క‌థ‌న‌డిపిస్తున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. త‌ర్వ‌లో 5 రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో క‌ర్ణాట‌క‌లో బీజేపీ ప్ర‌భుత్వం వ‌స్తే అది త‌మ‌కు బూస్ట్ ఇచ్చిన‌ట్లే అనే క‌మ‌ల‌నాధులు భావిస్తున్నారు. క‌ర్ణాట‌క ప్ర‌భావం ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లుపై పాజిటివ్ గా ప‌డె అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా తెలుపుతున్నారు. 
 
అందుకే క‌మ‌లం దృష్టి క‌న్న‌డ గ‌డ్డ‌పై ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. 224 స్థానాలు ఉన్న క‌ర్నాట‌క అసెంబ్లీలో మాజిక్ మార్క్ 113..అయితే మేలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ అత్య‌ధికంగా సుమారు 114 స్థానాల‌ను గెలిచినా బ‌ల నిరూప‌న‌లో ఫెయిల్ అయింది. అదే స‌మ‌యంలో 80 సీట్లు గెలిచిన కాంగ్రెస్, అలాగే 37 స్థానాలు సాధించిన జేడీఎస్ పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వాన్నిఏర్పాటు చేసింది. ఇక ఈ సంకీర్ణ కూట‌మిలో ఒక స్థానంతో బీఎస్పీ కూడా పాలుపంచుకుంది. దీని ఫ‌లితంగా ప్ర‌భుత్వానికి 118 స‌భ్యుల బ‌లం ఉంది. 
 
అయితే వీరిలో నుంచి 20 మంది ఎమ్మెల్యేలను త‌మ వైపు తిప్పుకోవ‌డానికి బీజేపీ ప్ర‌యత్నిస్తోంది. బుద‌వారం బెంగులూరుకు వ‌చ్చిన రాజ్ నాథ్ సింగ్ ఇచ్చిన ఆదేశాల‌తోనే ఎడ్యూర‌ప్ప తెర‌వెనుక మంత్రాంగం న‌డిపిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ప‌రిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ రంగంలోకి దిగాల‌ని డిమాడ్లు వినిపిస్తున్నాయి.  

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.