ఉత్కంఠకు తెరదింపిన బీజేపీ

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-05-17 16:21:41

ఉత్కంఠకు తెరదింపిన బీజేపీ

రెండు అతిపెద్ద జాతీయ పార్టీలకు కర్ణాటకలో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్ లాంటిది... ఈ సెమీఫైనల్ లో విజయం రెండు పార్టీలకు దోబుచులాడింది. ఏ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించలేదు కర్ణాటక ప్రజలు...బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించి కర్ణాటకలో అతి పెద్ద పార్టీగా అవతరించగా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ 78 స్థానాలతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక కింగ్ మేకర్ అవుదామనుకున్న జెడిఎస్ 38 స్థానాల్లో విజయం సాధించింది...
 
కర్ణాటకలో ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్య లేకపోవడంతో గంట గంటకు రాజకీయాలు మారిపోయాయి.. కాంగ్రెస్, జెడిఎస్ కి మద్దుతు ప్రకటించడంతో అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న ఈ రెండు పార్టీలకి బీజేపీ దెబ్బేసింది. కింగ్ మేకర్ అవుదామనుకున్న జెడిఎస్ కి, బీజేపీ సరైన సమయంలో పావులు కదిలించడంతో జెడిఎస్, కాంగ్రెస్ కి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి  ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంఖ్యా బలం లేకపోయినా అధికార పీఠాన్ని దక్కించుకుంది.
 
కర్ణాటక గవర్నర్ అధికారాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి అవకాశం ఇవ్వడంతో యడ్డ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు..కేవలం అయిదు నిముషాలలోనే ముగించారు...కర్ణాకట గవర్నర్ తీరును నిరసిస్తూ గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్, జెడిఎస్ నాయకులు నిరసనలు తెలియజేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.