కరుణానిధి రాజ‌కీయ ప్ర‌స్తానం సాగింది ఇలా

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-08-08 15:29:17

కరుణానిధి రాజ‌కీయ ప్ర‌స్తానం సాగింది ఇలా

మాజీ ముఖ్య‌మంత్రి కరుణానిధి మ‌ర‌ణంతో త‌మిళ‌నాడు రాష్ట్రం అంతా  శోకసంద్రంలో మునిగిపోయింది. రాష్ట్ర రాజ‌కీయాల్లోనే కాదు దేశ రాజ‌కీయనాయ‌కుల్లో అత్యంత సీనియ‌ర్ నాయ‌కుడు ఆయ‌న. అంతేకాదు చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి పార్టీ స్థాపించిన మొద‌టి సారే ఆయ‌న ముఖ్యమంత్రి అయి మ‌రో రికార్డ్ ను సాధించారు. 
 
ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రం సాగిందిలా..
 
పెరియార్ రామ‌స్వామి నాయ‌క్క‌ర్ ప్ర‌వ‌చిత ద్రావిడ భావ‌జాలం ప‌ట్ల ఆక‌ర్షితులైన క‌రుణానిధి 1944లో ద్రావిడ కళారంగంలో ప్ర‌వేసించారు. ఆ తరువాత పెరియార్‌తో విభేదించి… 1949లో అన్నాదురై స్థాపించిన డీఎంకేలో పనిచేశారు.
 
తొలిసారి 1957లో కులత్తలై నియోజకవర్గం నుంచి కరుణానిధి గెలుపొందారు.
1961లో డీఎంకే కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.
1967లో డీఎంకే అధికారంలోకి వచ్చాక ప్రజా పనులశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
1969లో అన్నాదురై మృతితో తమిళనాడు సీఎంగా కరుణానిధి బాధ్యతలు చేపట్టారు.
1977లో ఎంజీఆర్‌ సీఎంగా ఎన్నికయ్యాక… 13 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నారు.
ఎంజీఆర్‌ మరణానంతరం 1989లో కరుణానిధి సీఎం పదవి చేపట్టారు.
1971లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
1991లో డీఎంకే ఘోర పరాజయం
1996 ఎన్నికల్లో డీఎంకే అద్భుత విజయంతో మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
2001లో జయలలిత చేతిలో మళ్లీ కరుణానిధి పార్టీ ఓటమిపాలైంది.
2006 మే 13న మరోసారి కరుణానిధి తమిళనాడు అధికార పగ్గాలు చేపట్టారు.
2011లో మళ్లీ అధికారానికి దూరమయ్యారు.
ఇలా 1957 నుంచి 2016 వరకు మొత్తం 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన కరుణానిధి.. ప్రస్తుతం తిరువారూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.