కెవిన్ పీటర్సన్‌ సంచలన వ్యాఖ్యలు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-02-21 05:19:48

కెవిన్ పీటర్సన్‌ సంచలన వ్యాఖ్యలు

ఇంగ్లండ్ క్రికెట‌ర్ కెవిన్ పీటర్సన్‌ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. విధ్వంస‌క‌ర  ఆట‌గాడిగా గుర్తింపు పోందిన పీటర్సన్‌ భ‌విష్య‌త్తులో 5 రోజులు ఆడే టెస్ట్‌  క్రికెట్ పూర్తి స్థాయిలో త‌గ్గిపోతుంద‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా  పోస్ట్  చేసి క్రికెట్ అభిమానుల‌ను  కాస్త కంగారు పెట్టించాడు.
 
ఐదు దేశాల మాత్రమే టెస్ట్‌ క్రికెట్‌ కొనసాగిస్తాయ‌ని.... భారత్‌, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ మాత్రమే టెస్ట్‌ క్రికెట్ కొన‌సాగించ‌వ‌చ్చు అని వెల్లడించాడు. మిగతా దేశాల క్రికెటర్లు కేవ‌లం 20-20 ఫార్మెట్ కు మాత్ర‌మే ప‌రిమితం అవుతార‌ని తెలియ‌జేశాడు.
 
త‌న అంచ‌నాల ప్ర‌కారం టెస్ట్‌ క్రికెట్‌కు న్యూజిలాండ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌ జట్లు ముగింపు ప‌ల‌క‌వ‌చ్చ‌ని అన్నారు. ఈ విష‌యం క‌చ్చితంగా జ‌రుగుతుంద‌ని  నేను చేసిన ఈ ట్వీట్ అంద‌రూ గుర్తుంచుకోవాలి అన్నారు.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో పాల్గొనేందుకు దుబాయ్‌ వెళుతున్న‌ పీటర్సన్‌ ఈ సంచలన ట్వీట్‌ పెట్టాడు... టెస్ట్‌  క్రికెట్లో విరోచిత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసే కెవిన్ పీటర్సన్ ఇలా స్పందించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.. దీనిపై మాజీ ఆటగాళ్లు, క్రికెటర్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.