బ్రేకింగ్.. రాహుల్ స‌మ‌క్షంలో కొండా సురేఖ కాంగ్రెస్ తీర్థం

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

konda surekha
Updated:  2018-09-26 12:41:49

బ్రేకింగ్.. రాహుల్ స‌మ‌క్షంలో కొండా సురేఖ కాంగ్రెస్ తీర్థం

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌మ పార్టీ త‌ర‌పున పోటీ గుర్రాల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో కొంద‌రి సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ సీటు కేటాయించ‌క‌పోవ‌డంతో కొంత‌కాలం పాటు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇలా అసంతృప్తితో ఉన్న నాయ‌కుల్లో కొండా దంప‌తులు కూడా ఉన్నారు. 
 
అభ్య‌ర్థులు జాభితాలో కొండా దంప‌తులు పేర్లు లేక‌పోవ‌డంతో త‌న‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ సీటు ఎందుకు కేటాయించ‌లేదో చెప్పాల‌ని మీడియా స‌మ‌క్షంలో అధిష్టానాన్ని ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. ఇక అధిష్టానం నుంచి అమెకు ఎలాంటి స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డంతో తాజాగా దంప‌తులు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ కు భ‌హిరంగ లేక రాసి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు కొండ సురేఖ. గుడ్ బై చెప్ప‌డ‌మే కాకుండా ముఖ్య‌మంత్రి పై ఆయ‌న కుమారుడు కేటీఆర్ పై సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు.
 
ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో కొండా దంప‌తులు తిరిగి సొంతగూడు అయిన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. ఈ క్ర‌మ‌మంలో నిన్న సాయంత్రం డిల్లీకి చేరుకున్న కొండా దంప‌తులు కాంగ్రెస్ నేత‌లతో చ‌ర్చిస్తున్నారు. చ‌ర్చ‌ త‌ర్వాత పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకుంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు పార్టీ త‌ర‌పున టికెట్ కూడా ఫిక్స్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.