బీజేపీలోకి కోట్ల‌

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

bjp
Updated:  2018-08-27 12:31:44

బీజేపీలోకి కోట్ల‌

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు పార్టీని బ‌లోపేతం చేసి అధికార‌ తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.
 
ఈ క్ర‌మంలో పార్టీకి చెందిన నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేస్తున్న క్ర‌మంలో ఊహించ‌ని రీతిలో కోట్ల హ‌రి చ‌క్ర‌పాణి రెడ్డి బీజేపీ తీర్థం తీసుకోనున్నారు. 
 
అయితే ఇప్ప‌టికే ఆయ‌న అన్ని ఏర్పాట్ల‌ను సిద్దం చేసుకున్నారు. కాగా రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత  2014 ఎన్నిక‌ల్లో కోట్ల ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీ అభ్య‌ర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి త‌న స‌మీప అభ్య‌ర్థి కేఈ కృష్ణ మూర్తి చేతిలో ఓట‌మి చెందారు. 
 
ఇక అప్ప‌టి నుంచి ఆయ‌న మీడియా ముందు ఎక్క‌డ క‌నిపించ‌లేదు. ఇప్పుడు 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో త‌న ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ స‌భ్యురాలు పురందేశ్వ‌రి ఆధ్వ‌ర్యంలో బీజేపీ తీర్థం తీసుకోనున్నారు కోట్ల‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.