మంత్రి గారు ఏంటీ.... ఈ పని

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-02-15 05:37:36

మంత్రి గారు ఏంటీ.... ఈ పని

ఎన్డీఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మొద‌టగా దేశ ప‌రిశుభ్ర‌త కొసం  స్వ‌చ్చ భార‌త్  పేరుతో  దేశంలో ఉన్న న‌గ‌రాల‌ను ప‌రిశుభ్ర‌త చేయిస్తున్న సంగ‌తి తెలిసిందే... ఈ కార్యక్ర‌మం కోసం ఎన్డీఏ స‌ర్కార్ అనేక నిధుల‌ను కేటాయించింది.. ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌లో ప్ర‌తీ ఏటా క‌ర్ణాట‌క రాష్ట్రం మొద‌టి స్థానంలో ఉంటుంది.
 
అయితే ఈసారి ఎలాగైనా స్వ‌చ్చ భార‌త్ అభియాన్ కింద మొద‌టి స్థానాన్ని సంపాదించుకునేందుకు రాజ‌స్థాన్ రాష్ట్రం ప్ర‌య‌త్నిస్తోంది... స‌రిగ్గా అదే స‌మ‌యంలో అంద‌రూ చూస్తుండ‌గానే రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి కాలిచ‌ర‌ణ్ శ‌ర‌ఫ్  ర‌హదారి ప‌క్క‌న మూత్రం పోస్తూ మీడియా కంట ప‌డ్డారు...
kali charan saraf
 
దీంతో శ‌ర‌ఫ్ ర‌హ‌దారిపై మూత్రం పోయ‌డంపై ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు... ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో మ‌ల విస‌ర్జ‌న చేయ‌కూడ‌ద‌ని చెప్పిన నాయ‌కులు, ఇప్పుడు బ‌హిరంగంగా మూత్రం చేస్తున్నార‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మండిప‌డుతున్నారు...
 
ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో కూడా చాలా మంది నెటిజ‌న్లు  శ‌ర‌ఫ్ మూత్రం చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ మంత్రి ప్ర‌వ‌ర్త‌న‌ను త‌ప్పు ప‌డుతున్నారు... కాగా ఇది చాలా చిన్న విష‌య‌మ‌ని మంత్రి కాలి చ‌ర‌ణ్ శ‌ర‌ఫ్ కొట్టిపారేస్తున్నారు... 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.