ఫేస్‌బుక్ సీక్రెట్‌ను నాయ‌కుల‌కు చెప్పిన ప్ర‌ధాని మోదీ

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

narendra modi meeting with bjp leaders
Updated:  2018-03-26 04:25:10

ఫేస్‌బుక్ సీక్రెట్‌ను నాయ‌కుల‌కు చెప్పిన ప్ర‌ధాని మోదీ

స‌మాజంలో ఎక్క‌డ ఏమి జ‌రిగినా క్ష‌ణాల్లో ప్ర‌జ‌ల‌కు స‌మాచారం అందించ‌డంలో మీడియా ప్ర‌ముఖ పాత్ర వ‌హిస్తున్న‌ది అని చెప్ప‌వ‌చ్చు. అయితే ఆ మీడియా కూడా వ్యాపారం కోసం ప్ర‌ముఖుల‌కు సంబందించిన వార్త‌లను మాత్ర‌మే ప్ర‌చురిస్తుంది అని చెప్ప‌డంలో సందేహం లేదు. అయితే ప్ర‌స్తుత మీడియాకు సంబంధం లేకుండా సోష‌ల్ మీడియాకు సంబందించిన ఫేస్‌బుక్ ద్వారా మ‌నం చేసే ఎలాంటి కార్య‌క్ర‌మాల‌ను అయినా ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌వ‌చ్చు. ఈ సోష‌ల్ మీడియాను వినియోగించుకుని రాష్ట్రాల్లోను, దేశాల్లోను రాజ‌కీయ ప‌ద‌వుల‌ను సైతం అందిపుచ్చుకున్నారు నేతలు.
 
భార‌తదేశంలో ప్ర‌స్తుత ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం సోష‌ల్ మీడియానే అని ప‌లు సంద‌ర్భాల్లో అనేక మంది నాయ‌కులు వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ఉన్న యువ‌కులంద‌రూ సోషల్‌ మీడియాలో స్నేహితుల సంఖ్యను పెంచుకుంటున్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని విజ‌యం సాధించిన ప్ర‌ధాని మోదీ ఇప్పుడు త‌న క్యాబినెట్‌కు సైతం ఇదే విష‌యాన్ని తెలియ‌చేస్తున్నారు... వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజ‌యం సాధించాలంటే త‌ప్ప‌కుండా సాంకేతికతను, సోషల్‌ మీడియాను ఉప‌యోగించుకోవాల‌ని.. తమ ఎంపీలకు, నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారట. 
 
ఇటీవల జరిగిన బీజేపీ  పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ... తమ ఎంపీల ఫేస్‌బుక్‌ పేజీలు, వాటి లైక్‌ల గురించి ప్రస్తావించారట.ఫేస్‌బుక్‌తో కలిగే ప్రయోజనాలను తమ ఎంపీలకు వివరించారు. ప్రతి ఎంపీ కనీసం 3 లక్షల ఫేస్‌బుక్‌ లైకులు సంపాదించాలని సూచించారు. వీడియో కాల్‌ ద్వారా క్షేత్రస్థాయి కార్యకర్తలకు చేరువ కావాలని ఆయన దిశానిర్దేశం చేశారు. 
 
ముందు ఫేస్‌బుక్‌ పేజీలు ఎంతమందికి ఉన్నాయని ఎంపీలను ఆయన ప్రశ్నించారు.  దాదాపు అంద‌రూ  తమకు ఫేస్‌బుక్‌ ఖాతా ఉన్నట్లు చేతులెత్తారు. వాటిలో 3లక్షల లైకులు ఎంతమందికి ఉన్నాయని మోదీ ప్రశ్నించగా అతి కొద్దిమంది మాత్రమే చేతులు పైకి లేపినట్లు ఆ సమావేశానికి హాజరైన ఓ ఎంపీ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఫేస్‌బుక్‌తో ఎంతోమందికి చేరువ కావొచ్చని..  ప్రతి ఎంపీ  కనీసం 3 లక్షల నిజమైన లైకులు సాధించాలని ప్రధాని చెప్పారు. కొన్ని మార్కెటింగ్‌ సంస్థలతో పొందే నకిలీ లైకులు అవసరం లేదని ఆయన ఎంపీలకు సూచించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.