బీజేపీలో ప‌ద‌వుల నియామ‌కం

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-08-04 18:20:27

బీజేపీలో ప‌ద‌వుల నియామ‌కం

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌ త‌రుణంలో ఏపీలో బీజేపీ ప‌ట్టు సాధించాల‌నే ఉద్దేశంతో రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నాలక్ష్మీనారాయ‌ణ అలాగే ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు అనేక ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ధాని మోడీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శిస్తున్న తీరుని వ్య‌తిరేకిస్తూ మీడియా ద్వారా బీజేపీ నాయ‌కులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు.
 
తాము విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌కు వ్య‌తిరేకం కాద‌ని ఈ విష‌యాల్లో చంద్ర‌బాబు యూట‌ర్న్ తీసుకున్నార‌ని క‌న్నా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఒకవైపు విమ‌ర్శ‌లు చేస్తునే మ‌రో వైపు రాష్ట్రంలో పార్టీని బ‌లోపేతం చేసి  చంద్ర‌బాబుకు వచ్చే ఎన్నిక‌ల్లో చెక్ పెట్టేందుకు బీజేపీ నాయ‌కులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.
 
బీజేపీ రాష్ట్ర క‌మిటీ, అనుభంద విభాగాలవారిగి అభ్య‌ర్థుల‌ను క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ నియ‌మించారు. మొత్తం 8 మంది ఉపాధ్య‌క్షులు, న‌లుగురు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ‌లు, 14 మంది కార్య‌ద‌ర్శులు, ఒక కోశాదికారితో పాటు ప‌దిమంది జిల్లా అధ్య‌క్షుల‌తో రాష్ట్ర క‌మిటీని ఏర్పాటు చేశారు.
 
ఉపాధ్య‌క్షులుగా కందుల రాజ‌మోహ‌న్ రెడ్డి, ద‌ర సాంబ‌య్య‌, పాక స‌త్య‌నారాయ‌ణ‌, ద‌శ‌ర‌థ రాజ్ క‌విత‌, ఎస్ విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి, తుర‌గ నాగ‌భూష‌ణం, కే క‌పిలేశ్వ‌ర‌య్య‌, కే, కోటేశ్వ‌ర‌రావులను నియ‌మించారు.ఇక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా వీ స‌త్య‌మూర్తి, జ‌మ్మ‌ల శ్యాం కిషోర్, ఎస్ సురేష్ రెడ్డి, పీ మాణిక్యాల రావుల‌ను నియ‌మించారు. ఇక కోశాదికారిగా పీ స‌న్యాసి రాజును నియ‌మించిన‌ట్లు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.