ఆయ‌న బ్ర‌తికి ఉంటే... హాట్ టాపిక్ గా మారిన నిఖిల్ పొలిటికల్ ట్వీట్

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

nikhil
Updated:  2018-11-01 04:33:56

ఆయ‌న బ్ర‌తికి ఉంటే... హాట్ టాపిక్ గా మారిన నిఖిల్ పొలిటికల్ ట్వీట్

చిత్ర‌పరిశ్ర‌మ‌కు చెందిన హీరో నిఖిల్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ షూటింగ్ ల‌లో బిజి బిజిగా గ‌డుపుతున్నారు. నిఖిల్ ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా దేశంలో జ‌రుగుతున్న రాజ‌కీయ క‌రెంట్ ఇష్యూష్ ల‌పై త‌మ‌దైన శైలిలో స్పందింస్తుంటారు. గ‌తంలో కూడా ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర పై ప‌లు ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచాడు నిఖిల్.
 
తాను గుంటూరు జిల్లాలో రెండు రోజులు షూటింగ్ చేయ‌లేక పోయాన‌ని అయితే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇంత ఎండ‌లో అన్ని వేల కిలో మీట‌ర్లు న‌డ‌వ‌డం అంటే మాట‌లు కాదు అని త‌న అభిప్రాయాన్ని తెలిపాడు నిఖిల్. ఇలా అనేక‌ విష‌యాల‌పై స్పందిస్తున్న నిఖిల్ ఇదే క్ర‌మంలో నిన్న స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌ స్మార‌క స్టాచ్యూ ఆఫ్ యూనిటీపై స్పందించారు. ఈ విగ్ర‌హానికి కేంద్ర ప్ర‌భుత్వం సుమారు 3 వేల కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించిన సంగ‌తి తెలిసిందే. 
 
అయితే ఈ విగ్ర‌హానికి ఎందుకు అంత ఖ‌ర్చు అన్న‌ట్లుగా వ్యాఖ్యానించాడు నిఖిల్. దేశ‌మంత‌టినీ ఐక్యంగా ఉంచిన ఘ‌న‌త క‌చ్చితంగా స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ కే చెందుతుంది. ఆయ‌న చేసిన కృషికి క‌చ్చితంగా త‌గిన గుర్తింపు ఇవ్వాల్సిందే. అయితే ఆయ‌న బ్ర‌తికి ఉంటే మాత్రం త‌న విగ్ర‌హ ఏర్పా