సీఎం పై చెప్పుల దాడి

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-02-21 12:11:34

సీఎం పై చెప్పుల దాడి

భువనేశ్వర్‌లో బేజీపూర్ అసెంబ్లీకి ఉపఎన్నిక జ‌రుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారం ముమ్మ‌రం చేశాయి. ఈ ఎన్నిక‌ను ఛాలెంజింగ్‌గా తీసుకున్న అన్ని పార్టీలు ప్ర‌ముఖుల‌తో ప్ర‌చారం చేయిస్తున్నాయి. అందులో భాగంగానే అధికార పార్టీ స్వ‌యంగా  ముఖ్య‌మంత్రి నవీన్ పట్నాయక్‌ను ప్ర‌చారంలోకి దించింది. 
 
ప్ర‌చారంలో భాగంగా కుంభారి గ్రామంలో బ‌హిరంగ స‌భ  నిర్వహించింది అధికార పార్టీ .  ఈ స‌భ‌లో సిఎం నవీన్ పట్నాయక్ ప్రసంగిస్తుండగా ఆయ‌న పై గుర్తు తెలియని వ్యక్తి చెప్పులతో దాడి చేశాడు. దీన్ని గ‌మ‌నించిన సీఎం చెప్పుల దాడి నుంచి త‌ప్పించుకున్నారు. దీంతో అక్క‌డున్న పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చెప్పులతో దాడి చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన‌ వ్యక్తి  బీజేపీకి చెందిన‌ కార్యకర్తగా గుర్తించారు. ఈ ఘటన బార్‌ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.