ద్రవిడ ఉద్యమ పితామ‌హుడు బీజేపీ పెరియార్ విగ్రహం కూల్చివేత

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

periyar statue image
Updated:  2018-03-07 06:07:13

ద్రవిడ ఉద్యమ పితామ‌హుడు బీజేపీ పెరియార్ విగ్రహం కూల్చివేత

ఉత్తరాది అహంకారానికి ప్రతినిధిగా వ్యహరిస్తున్న BJP తన నిజస్వరూపాన్ని ఒక్కొక్క‌టిగా బయటపెడుతున్నది. తాజాగా త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చిన ఆ పార్టీ రోజు గడవక ముందే ఏకంగా ద్రవిడజాతి పితామహుడు స్వాతంత్య్ర సమర యోదుడు పెరియర్ రామస్వామి విగ్రహాన్ని కూల్చివేశారు. కూల్చివేతకు  BJP అనడానికి ఆదారాలు లేవు కానీ ఆ పార్టీనేతలు బహిరంగంగా పెరియార్ విగ్రహాలను కూల్చాలని పిలుపునివ్వడం వలన వారికి సంబంధం ఉంది అన్న సందేహం కలగక మానదు.
 
లెనిన్ BJP వామపక్షాల సిద్దాంత సమస్య, అంతే కాదు లెనిన్ విదేశాలకు సంబంధించిన వారు అంటున్నారు. మరి తమిళనాడుకు చెందిన పెరియార్ ను అవమానించే అధికారం వారికి ఎవరు ఇచ్చారు. ద్రవిడ ప్రాంతానికి చెందిన ప్రజానాయుకుడుని ఉత్తరభారత జనతాపార్టీ అయిన  BJP కి ప్రశ్నించే అధికారం ఎక్కడిది. ఇది కచ్చితంగా ద్రవిడ ప్రాంత ప్రజలపై  BJP దాడిగానే భావించాలి.
 
పెరియార్ నేపథ్యం......
పెరియార్ తన రాజకీయ జీవితాన్ని స్వాతంత్య్ర‌ ఉద్యమంలో కాంగ్రెస్ తో ప్రారంభించి క్రమేన ద్రవిడ ఉద్యమపితామహుడిగా మారారు. వారు ప్రారంభంలో బ్రాహ్మణ ఆదిపత్యదోరణికి వ్యతిరేకంగా సాంసృతిక ఉద్యమాన్ని DK ( ద్రవిడ కజగం ) పేరుతో ప్రారంభించారు. అది క్రమేన ద్రవిడ ఉద్యమంగా మారింది. ఉత్తరభారత ఆదిపత్య రాజకీయాలను ప్రశ్నించింది. బడుగు, బలహీన వర్గాల హక్కులను ప్రస్తావించింది. వారి ప్రయత్నాలకు కొనసాంగింపుగా సాంసృతిక ఉద్యమానికి రాజకీయ ఉద్యమాన్ని జోడించి DMK  ని స్దాపించి అన్నాదొరై తమిళనాడులో జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బలమైన రాజకీయ వేదికగా నిర్మించారు.
 
1960 దశకంలో బలవంతంగా హిందీని అమలు చేయాలని నాటి కేంద్రం చేసిన బలప్రయోగాన్ని నిలవరించింది తమిళనాడు.  కాలక్రమంలో AIDMK , DMK లుగా రెండు ద్రవిడ పార్టీలు తమిళనాడు ప్రజలకు ప్రాతినిద్యం వహిస్తున్నాయి నేటికి అక్కడ జాతీయ పార్టీలకు స్దానంలేకుండా ఉంది. అలాంటి గొప్ప ఉద్యమానికి పితామహుడు పెరియార్. కచ్చితంగా జాతిపిత మహత్మాగాంధీ అయితే ద్రవిడ ఉద్యమ నేతగా దక్షిణ భారత ప్రజల పితామహుడు పెరియార్. అలాంటి వారి విగ్రహాలను ధ్వంసం చేయమని బహిరంగంగా  BJP పిలిచి ఇవ్వడం నిస్సందేహంగా అహంకారమే.
 
ఉబయ తెలుగు రాష్ట్రాలకు విభ‌జన చట్టం అమలు చేయకుండా తెలుగు ప్రజలకు ద్రోహం చేసింది BJP. మొన్నటి వరకు కేరళలో లేని సమస్యను సృష్టించి అక్కడ రాజకీయాలను అస్థిరపరిచే కుట్రను పన్ని అబాసుపాలైనది. ఇప్పుడు ఏకంగా ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్ ను అవమానించడం ద్వారా ద్రవిడ ప్రాంతం పై తనకున్న అహంకారపూరితమైన వివక్షను బహిరంగంగా వ్యక్తం చేసింది  BJP.
 
అందుకే  BJP భారతీయ జనతా పార్టీ కాదు ఉత్తరభారత పార్టీ మాత్రమే. వారి అహంకారపూరిత రాజకీయాలకు ఇప్పటికే దక్షిణ భారతం భారీమూల్యం చెల్లించుకుంది. ఇకనైనా వాటికి చ‌రమ‌గీతం పలకాలి. పార్టీలకతీతంగా ద్రవిడ జాతి అస్దిత్వాన్ని ప్రశ్నిస్తున్న ఉత్తర భారత పార్టీ అయిన  BJP ముక్త భారత దేశం కావాలి. అది దక్షిణాది నుంచే ప్రారంభంకావాలి ద్రవిడ ఉద్యమం తన చారిత్రక పాత్రను పోషించే సమయం ఆసన్నమయింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.