5వంద‌ల కోట్ల‌ నిధుల‌ను కేటాయించిన మోడీ

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

pm modi
Updated:  2018-08-18 03:07:47

5వంద‌ల కోట్ల‌ నిధుల‌ను కేటాయించిన మోడీ

కేర‌ళ క‌న్నీళ్లు పెడుతోంది. వ‌ర‌ద నీటిలో కొట్టుకు పోతూ స‌హాయం కోసం ఎదురు చూస్తోంది. జ‌ల ప్ర‌ళ‌యానికి  సుమారు 400ల‌కు పైగా మ‌ర‌ణించారు. వ‌రుణు ప్ర‌భావంతో ఊళ్ల‌కు ఊర్లు కొట్టుకు పోవ‌డంతో ప్ర‌జ‌లు నిరాశ్ర‌యులు అయిపోయారు. దీంతో కేర‌ళ అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు యుద్ద ప్రాతిపాదిక‌న స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నా ఇంకా వేలాది మంది వ‌ర‌ద‌నీటిలోనే చిక్కుకున్నారు. ఇక‌ ఇదే త‌ర‌హాలో మ‌రో రెండు రోజుల పాటు కేర‌ళ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ‌ తెలుపడంతో మ‌ళ‌యాలిలు భ‌యాందోళ‌న చెందుకుతున్నారు. 
 
భారీ వ‌ర్షాల వ‌ర‌ద‌ల‌కు కేర‌ళ రాష్ట్రంకు 19వేల 5వంద‌ల‌12 కోట్ల న‌ష్టం జ‌రిగిన‌ట్లు కేర‌ళ ప్ర‌భుత్వం ప్రాథ‌మికంగా అంచనా వేసింది. కొచ్చి నావెల్ ఆఫీస్ లో మోడీతో జ‌రిగిన స‌మీక్ష స‌మావేశంలో న‌ష్టం వివ‌రాలు ఆయ‌న‌కు అందించారు కేర‌ళ ముఖ్య‌మంత్రి. అయితే న‌ష్ట తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని త‌క్ష‌ణ సహాయం కింద 2వేల కోట్ల రూపాయ‌ల‌ను విడుద‌ల చేయాల‌ని  సీఎం ప్ర‌ధానికి విజ్ఞ‌ప్తి చేశారు. కానీ మోడీ ఐదువంద‌ల కోట్ల‌ను మాత్ర‌మే విడుద‌ల చేశారు. 
 
గ‌తంలో ఇచ్చిన వంద‌కోట్లకు ఇది అద‌న‌పు సహాయం కేంద్ర బృందాలు ప‌ర్య‌టించి న‌ష్టాన్ని అంచ‌నా వేసిన త‌ర్వాత మాత్ర‌మే వ‌ర‌ద స‌హాయాన్ని పెంచే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక మ‌రో వైపు వ‌ర‌ద‌ల్లో ప్రాణాలు కోల్పోయిన  వారి కుటుంబాల‌కు కేంద్రం స‌హాయం కింద రెండు ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం కింద ప్ర‌క‌టించారు మోడీ. అంతేకాదు తీవ్రంగా గాయ‌ప‌డిన వ్య‌క్తుల‌కు 20వేల రూపాయ‌ల‌ను ప్ర‌క‌టించారు ఆయ‌న. ఇక మోడీ ప్ర‌క‌టించిన స‌హాయానికి కేర‌ళ ముఖ్య‌మంత్రి ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. కేవ‌లం తక్ష‌ణ స‌హాయం కింద మాత్ర‌మే 5వంద‌ల కోట్ల‌ను ప్ర‌క‌టించార‌ని ఇంకా న‌ష్ట పరిహారాన్ని అంచ‌నావేసి నిధుల‌ను కేటాయిస్తార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.