ఆప్ ఎమ్మెల్యేలపై వేటు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-01-21 05:07:27

ఆప్ ఎమ్మెల్యేలపై వేటు

దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి  చెందిన 20మంది   ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త వేటు ప‌డింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం  ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది. ఆప్ ఎమ్మెల్యేలు పార్ల‌మెంట‌రీ సెక్ర‌ట‌రీలుగా గ‌తంలో ప‌ని చేశార‌న్న కార‌ణంతో అన‌ర్హులుగా చేస్తూ ఎన్నిక‌ల క‌మీష‌న్ చేసిన  సిఫారస్ కు రాష్ట్రప‌తి  రామ్ నాధ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. 

అన‌ర్హుత వేలు పడిన ఎమ్మెల్యేల స్ధానాల‌కు త్వ‌ర‌లో ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. 20 మంది ఎమ్మెల్యేలపై వేటు ప‌డ‌టంతో ఆప్ బ‌లం న‌ల‌భై ఐదుకు చేరింది.  ఎమ్మెల్యేలు  మొత్తం 21 మంది  2015, మార్చి 13 నుంచి సెప్టెంబరు 8, 2016 వరకు పార్లమెంటరీ కార్యదర్శుల పదవిలో ఉండటం ద్వారా లాభదాయక పదవులను చేపట్టినట్లయిందని, ఈ కార‌ణంగా వారిని అన‌ర్హులుగా ప్ర‌క‌టించారు. 21 మందిలో   ఒక‌రు రాజీనామా చేశారు. 

మ‌రోవైపు  తెలుగు రాష్ట్రాల్లో శాస‌న స‌భ్యులు పార్టీ ఫిరాయించ‌డంతో పాటు వారికి,  అధికార పార్టీ  ఏకంగా మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టింద‌ని,  ఫిరాయింపుల‌పై  మాత్రం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌టం లేదంటూ ఎన్నిక‌ల సంఘంపై  ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.