నిరుద్యోగుల‌కు రాష్ట్రపతి స‌ల‌హా

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-02-11 01:44:51

నిరుద్యోగుల‌కు రాష్ట్రపతి స‌ల‌హా

ప్ర‌స్తుతం  మ‌న భార‌తదేశాన్ని ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌స్య నిరుద్యోగం....ఎంద‌రో యువ‌కులు డిగ్రీ ప‌ట్టాతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఉద్యోగాల క‌ల్ప‌న కోసం ప్ర‌భుత్వం అది చేస్తాం..ఇది చేస్తాం అని చెప్ప‌డ‌మే కాని, ఎలాంటి కార్య‌చ‌ర‌ణ లేద‌ని నిరుద్యోగులు మండిప‌డుతున్నారు
 
ఇలాంటి క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ యువ‌త, నిరుద్యోగంపై  సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర‌ప‌తి వ్యాఖ్య‌ల‌ను  ఓ ర‌కంగా స‌ల‌హా అనుకోవాలి. భార‌త వ్య‌వసాయ ఉత్ప‌త్తుల ద్వారా నిరుద్యోగాన్ని అరిక‌ట్ట‌వ‌చ్చని కోవింద్ అభిప్రాయ‌ప‌డ్డారు. 
 
వరి, పాలు, పళ్లు, కూరగాయలు, మిర్చి వంటి పంట‌లు పండించి సూపర్‌ మార్కెట్‌లకు అందిచండం ద్వారా ప్రపంచానికి ఆహారాన్ని అందించవచ్చని ఆయ‌న  అన్నారు. వ్యవసాయ రంగం భారత్‌లోని వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్సించడంలో సహాయ పడుతుందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
 
 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.