ప్రియాంక గౌనుపై అసెంబ్లీలో రగడ

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-02-21 06:27:25

ప్రియాంక గౌనుపై అసెంబ్లీలో రగడ

ఈ ఏడాదికి సంబంధించిన  పర్యాటక శాఖ కాలెండర్‌లో బాలీవుడ్ క‌థానాయిక‌  ప్రియాంక చోప్రా ఫోటోను ముద్రించింది అస్సాం ప్ర‌భుత్వం.  ఈ ఫోటోలో ప్రియాంక వేసుకున్న గౌను పై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నాయ‌కులు  తీవ్రంగా ఖండించారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ విష‌యం ఏకంగా  చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీని పై తీవ్ర స్థాయిలో వాద‌న జ‌రిగింది.
 
అస్సాం రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కొన‌సాగుతున్న‌ ప్రియాంక చోప్రాను వెంట‌నే తొలగించాని రాష్ట్ర ప్రతిపక్ష  కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అస్సాం పర్యాటక రంగ క్యాలెండర్‌ ఫొటోషూట్‌ సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించి ఉంటే.. పర్యాటకంగా రాష్ట్రం అభివృద్ది చెందేద‌ని అన్నారు. ప్రియాంక చోప్రాను అంబాసిడర్‌గా నియమించినప్పటికీ అభివృద్దికాక పోవ‌టానికి సంప్రదాయ దుస్తులు ధ‌రించ‌క‌పోవ‌డ‌మే కార‌ణ‌మంటూ  అస్సాం ప్రతిపక్ష నేత సైకియా అన్నారు.
 
అయితే ప్రియాంకకు అస్సాం ప్ర‌భుత్వం మద్దతు నిలిచింది.  అసెంబ్లీ ముగిసిన అనంత‌రం మంత్రి హిమంత్‌ బిస్వా శర్మ మీడియాతో మాట్లాడుతూ.... ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లోనే ఉండడమనేది సాధ్యం కాదని  అన్నారు. మనం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లినప్పుడు రాష్ట్ర సంప్రదాయ దుస్తులైన‌ ధోతిని ధరించి వెళ్తున్నామా.. అని ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌శ్నించారు. ఇత‌ర దేశాల‌ నుంచి మ‌న‌దేశానికి వచ్చే వారిని సంప్రదాయ దుస్తుల్లో వస్తేనే ఆహ్వానిస్తున్నామా అని ఆయన కాంగ్రెస్ నేతలను నిల‌దీశారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.