ఐరాస ఎదుట వింత నిర‌స‌న‌

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-01-27 05:13:19

ఐరాస ఎదుట వింత నిర‌స‌న‌

ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లంతా క‌లిసి పొరాడ‌డం స‌హ‌జ‌మే. ప్ర‌భుత్వంపై అనేక ర‌కాలుగా నిర‌స‌నలు తెలియ‌జేస్తారు ప్ర‌జ‌లు. అది చ‌రిత్రను కించ ప‌రిచడంలోనైనా, ప్ర‌స్తుత జీవనానికి అటంకం క‌లిగిననా, భ‌విష్య‌త్తు స‌మాజానికి చేటు జ‌రిగే సంఘ‌ట‌న‌లు ఏవైన జ‌రిగితే వాటిని ఖండిస్తూ.... ప్లకార్డులను చేతబట్టి నల్లబ్యాడ్జీలతో, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలతో తమ అసమ్మతిని ప్రభుత్వానికి తెలిపే ప్రయత్నం చేస్తారు.

ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే కాదు ఇప్పుడు మూగ జీవాల‌కు కూడా స‌మ‌స్య‌ల వ‌చ్చిప‌డుతున్నాయి. అయితే అవి నేరుగా తమ జాతిపై జరుగుతున్న ప్రయోగాలను వ్యతిరేకిస్తూ బాడీ షాప్‌, క్రూయాలిటీ ఫ్రీ ఇంటర్నేషనల్‌ సంస్థల ఆధ్వర్యంలో ఎనిమిది శునకాలు ఏకంగా ఐక్యరాజ్యసమితి కార్యాల‌యం ముందు నిరసనకు దిగాయి.

మూగ జీవాల‌పై జ‌రుగుతున్న కాస్మోటిక్ ప్ర‌యోగాల‌పై ఈ రెండు సంస్థ‌లు క‌లిసి పొరాడుతున్నాయి. అందుకు వాటికి శిక్ష‌ణ ఇచ్చి మ‌రి శునకాల మెడలో ప్లకార్డులను వేసి, వెనుక బ్యానర్లతో నిరసన చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా జంతువులు చేపట్టిన తొలి నిరసన కూడా ఇదే.

ప్రయోగాల మూలంగా సంవత్సరానికి రెండు ల‌క్ష‌ల శున‌కాలు మ‌ర‌ణిస్తున్నాయ‌ని అంతర్జాతీయ హ్యూమన్‌ సొసైటీ పేర్కొంది. మానవ సంబంధిత లేపనాలు సబ్బులు, శాంపులు, తయారీ త‌ర్వాత‌ వాటిని ముందుగా జంతువులపై ప్రయోగిస్తారు. అవి స‌ఫ‌ల‌మైతేనే మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. ముఖ్యంగా చర్మం, కళ్లకు సంబంధించిన విషయంలో వీటి ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు కాస్మోటిక్ ప్ర‌యోగాల‌ను నిషేధించాయి. కానీ సుమారు 80 శాతం వరకు దేశాలు ఈ ప్రయోగాల గురించి ఎలాంటి చట్టాలు తీసుకురాలేదు. భారత్‌లో మాత్రం వీటిని పూర్తిగా నిషేధించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.