రాజా సంచలన వ్యాఖ్యలు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-01-21 01:25:58

రాజా సంచలన వ్యాఖ్యలు

దేశంలో సంచ‌ల‌నం రేపిన 2జీ స్కాంలో కేంద్ర మాజీ మంత్రి రాజాతో పాటు త‌మిళ‌నాడు మాజీ పార్ల‌మెంట్ స‌భ్యులు క‌నిమొళి నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డిన  విష‌యం అంద‌రికీ తెలిసిందే. తాజాగా ఓ కార్య‌క్రమంలో పాల్గొన్న రాజా, మాజీ కాగ్ వినోద్ రాయ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  చేశారు.

యూపిఏ ప్ర‌భుత్వాన్ని నాశ‌నం చేసేందుకు వినోద్ రాయ్ య‌త్నించాడంటూ రాజా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కొన్ని దుష్ట శక్తులు యూపియే ప్ఱ‌భుత్వాన్ని నాశ‌నం చేసేందుకు ప్ర‌య‌త్నించ‌య‌ని, అందుకోసం వినోద్ ను కాంగ్రాక్ట్ కిల్ల‌ర్ గా నియ‌మించుకున్నార‌ని  ఎద్దేవా చేశారు.

వినోద్ రాయ్ ప‌ద‌విని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేశాడ‌ని ఆరోపించ‌డంతో పాటు ప‌లు మీడియా సంస్ధ‌ల‌పై రాజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌పై కొన్ని ఛాన‌ళ్లు అస‌త్య ప్ర‌చారాల‌ను ప్ర‌సారం చేశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.