అసెంబ్లీ సీట్ల పెంపు వార్త హ‌ల్ చ‌ల్

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-01-24 09:01:14

అసెంబ్లీ సీట్ల పెంపు వార్త హ‌ల్ చ‌ల్

తెలుగు రాష్ట్రాల్లో నియోజ‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న అంశంపై ఓ వార్త ఇప్పుడు మీడియా స‌ర్కిల్స్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.  గ‌త కొంత కాలంగా అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై ప‌లు వార్త‌లు తెర‌పైకి వ‌స్తూనే ఉన్నాయి. విభ‌జ‌న నేప‌థ్యంలో ఇటు తెలంగాణ‌, అటు  ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ  స్ధానాలు పెంచుతామంటూ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొంది అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం. 
 
2014 ఎన్నిక‌ల త‌ర్వాత రెండు రాష్ట్రాల్లో  పెద్ద ఎత్తున ఫిరాయింపులు జ‌రిగిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో అధికారంలో ఉన్న టీఆర్ ఎస్, టీడీపీకి అసెంబ్లీ సీట్ల పెంపు ఎంతో  కీలకంగా మారింది. దీంతో ఏపీ, తెలంగాణలోని అసెంబ్లీ స్థానాల పెంపుకు ప్రధాని మోడీ ఆమోదం తెలిపారంటూ ఇప్పుడు ఓ వార్త  చక్క‌ర్లు కొడుతోంది.
 
సీట్ల పెంపుపై  కేంద్ర ప్ర‌భుత్వం సానుకులంగా స్పందించిందని ఇటీవ‌ల చంద్ర‌బాబు నాయుడు పేర్కొన్నారు. మ‌రోవైపు  ప్ర‌త్యేక హోదాను ప‌క్క‌దారి ప‌ట్టించ‌ని త‌రుణంలో విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న  అంశాన్ని నెర‌వేర్చామ‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో చెప్పుకునేందుకు  సీట్ల పెంపుని అమలు చేసే ఆలోచ‌న‌లో కేంద్రం ఉన్న‌ట్లు స‌మాచారం. 
 
రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో నియోజకవర్గాల పెంపుకు సంబంధించి చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్ట‌నున్నార‌ని, దీన్ని ఆమోదించడ‌మే త‌రువాయి అంటూ వార్త‌లు  వ‌స్తున్నాయి. అయితే ప్ర‌స్తుతం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దావోస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విషయం అంద‌రీకీ తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ వార్త‌లో  నిజ‌మేంత అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.