ఏచూరి చూపు బీజేపీ వైపు నిజ‌మేనా...

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-01-26 11:18:34

ఏచూరి చూపు బీజేపీ వైపు నిజ‌మేనా...

సీపీఎం(ఐ) పార్టీలో విభేదాలు తారాస్ధాయికి చేరాయా... సీపియం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్టీని వీడ‌నున్నారా.... బీజేపీ ఏచూరికి ఇచ్చిన బంప‌ర్ ఆఫ‌ర్లు ఏంటి....అస‌లు ఈ వార్త‌లో వాస్తవం ఉందా......ప్ర‌స్తుతం తెర‌పైకి వ‌చ్చిన కొత్త ప్ర‌శ్న‌లు ఇవి.

సీపియం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్న సీతారం ఏచూరిపై ఇప్పుడు ప‌లు ఆస‌క్తిర వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వ‌చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ముందుకు సాగుతామ‌న్న ఏచూరి ప్ర‌తిపాద‌న‌ను సీపిఎం పార్టీ తిర‌స్క‌రించ‌డంతో ఆయ‌న పార్టీ వీడే యోచ‌న‌లో ఉన్నార‌నే వార్త ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌ధాన మంత్రి స‌ల‌హాదారునిగా కాని, ఏదైనా దేశానికి రాయ‌బారిగా కాని నియ‌మించేందుకు బీజేపీ ఆఫర్ చేసింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌మ్యునిస్ట్ భావాలు ఉన్న వారిని ప్ర‌ధాన‌మంత్రి వ‌ద్ద ఉంచ‌బోర‌ని అందుకే రాయ‌బారిగా నియ‌మించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు.

సీతారాం ఏచూరి పార్టీ మారుతున్నార‌నే ప్ర‌చారం జ‌ర‌గ‌డానికి కార‌ణం కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారం అనే చెప్ప‌వ‌చ్చు... కాని, కాంగ్రెస్ పార్టీకి తాను అనుకూల‌మ‌నే ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని సీతారాం ఏచూరి స్ప‌ష్టం చేశారు. దీంతో ఆయ‌న బీజేపీలోకి వెళ్తార‌నే వార్త‌లు కూడా అవాస్త‌వ‌మ‌నే చెప్పాలి. క‌మ్యునిస్ట్ భావాలు ఉన్న వారు మ‌త‌త‌త్వ భావాలు గ‌ల పార్టీలోకి వెళ్ల‌డం అసాధ్య‌మ‌ని కూడా కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.