జైల్లో విద్యార్ధిగా మారిన శశికళ

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-01-20 09:39:10

జైల్లో విద్యార్ధిగా మారిన శశికళ

అక్ర‌మాస్తుల కేసులో ఇరుక్కుని జైల్లో ఊచ‌లు లెక్క‌పెడుతున్న శ‌శిక‌ళ, తాను ఉంటున్న జైల్లోనే  ఒక కొత్త ప‌ద్ద‌తికి స్వీకారం చుట్టారు... కొద్ది కాలంగా బెంగుళూరు సెంట్ర‌ల్ జైలులో ఖైధీల కోసం ప్ర‌త్యేకంగా అడ‌ల్ట్ లిట‌ర‌సీ అనే కార్య‌క్ర‌మాన్ని పోలీసు అధికారులు చేప‌డుతున్నారు.... ఈ కార్య‌క్ర‌మం ముఖ్య ఉద్దేశం చ‌దువు రాని ఖైధీల‌కు చ‌దువు నేర్పించేందుకు ఈ కార్య‌క్ర‌మానికి  అధికారులు స్వీకారం చుట్టారు.,

అయితే ఈ అడ‌ల్ట్ లిట‌ర‌సీ లో శ‌శిక‌ళ కూడా పాల్గొని క‌న్న‌డ భాష రాయ‌డం, చ‌ద‌వ‌డం నేర్చుకుంటున్నారు... ప్ర‌తీ రోజూ నిర్వ‌హించే అడ‌ల్ట్ క్లాసుల‌కు త‌న బంధువు ఇళ‌వ‌ర‌సితో క‌ల‌సి వెళ్లి , క‌న్న‌డ భాష ను నేర్చుకుంటున్నారు.. అందులో భాగంగానే లైబ్ర‌రీ కి వెళ్లి పుస్త‌కాల‌ను చ‌దువుతున్నారు. అంతే కాకుండా కంప్యూట‌ర్ పై అవ‌గాహన తెచ్చుకునేందుకు కంప్యూట‌ర్ త‌ర‌గ‌తుల‌కు ఆమె వెళుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.