అమ్మాయిల జోలికి వ‌స్తే...?

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-03-08 04:47:01

అమ్మాయిల జోలికి వ‌స్తే...?

మ‌హిళ‌ల‌కు ఎంతో విలువ ఇస్తాం మ‌న దేశంలో.. అలాగే  మ‌హిళ‌ల‌కు ఎంతో మ‌ర్యాద ఇస్తాం.. అయితే నేడు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా ప‌లువురు మ‌హిళ‌ల గురించి మాట్లాడారు... తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన ప్రకటన చేశారు మ‌హిళా దినోత్స‌వం సందర్బంగా.
 
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని  బహిరంగంగా ఉరి తీస్తామని  పేర్కొన్నారు... భోపాల్‌లో ఇవాళ ఆయన మహిళల కోసం కొత్తగా ముఖ్యమంత్రి మహిళా కోశ్ అనే ప‌థ‌కాన్ని ఆవిష్కరించారు... దీని ముఖ్య ఉద్దేశం వివాహం కాని 50 యేళ్లు పైబడిన ఒంటరి మహిళలకు ఈ పథకం కింద పెన్షన్ అందించనున్నట్టు ప్రకటించారు ఆయ‌న‌.. సీఎం ప్ర‌క‌టించిన ఈ ప‌థ‌కం పై మ‌హిళ‌ల నుంచి హ‌ర్షం వ్యక్త‌మ‌యింది.
 
మహిళలు లేకుండా ఒక్కరోజు కూడా ఏ పనీ జరగదని గుర్తుంచుకోవాలన్నారు....మహిళల కోసం కేవలం 1 రోజే ఎందుకు? మహిళలు లేకుండా ఒక్క రోజైనా ఇల్లు గడుస్తుందా? దేశం, ప్రపంచం ముందుకు నడవడం కుదురుతుందా? అసాధ్యం! మన దేశంలో ఎప్పటినుంచో స్త్రీలను ఆరాధించడం, గౌరవించడం సంప్రదాయంగా వస్తోంది. ఇవాళ మహిళలు అనేక కీలక హోదాల్లో రాణిస్తున్నారు అని చౌహాన్ పేర్కొన్నారు. దీనిపై దేశంలో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తోంది ఆయ‌న ప్ర‌క‌ట‌న పై అంద‌రూ హర్షం వ్య‌క్తం చేస్తున్నారు ఇలా ప్ర‌భుత్వాలు స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవాలి అని అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.