భార్య భ‌ర్త‌లకు పొలిటిక‌ల్ విడాకులు త‌ప్పదా..

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

congress
Updated:  2018-10-02 11:57:37

భార్య భ‌ర్త‌లకు పొలిటిక‌ల్ విడాకులు త‌ప్పదా..

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో నెల్లూరు జిల్లాలోని రాజ‌కీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో  తెలుగుదేశం పార్టీ, లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నే క్ర‌మంలో ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు వేరే పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ప‌న‌బాక‌ ల‌క్ష్మీ, ప‌న‌బాక కృష్ణ‌య్య...వీరిద్దరు దంప‌తుల‌లో ఒక‌రు కాంగ్రెస్ ను వీడ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఒకర‌కంగా చెప్పాలంటే ఈ దంప‌తులిద్ద‌రు గ‌తంలో నెల్లూరు కాంగ్రెస్ కి పెద్ద‌దిక్కుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలుగు ప్రాంతాల‌ను రెండు రాష్ట్రాలుగా విభ‌జించ‌డంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోమా స్థితిలో ఉంది. దీంతో ప‌న‌బాక దంప‌తులు పార్టీ మారే  అవ‌కాశం ఉన్న‌ట్లుగా కాంగ్రెస్ పార్టీ కండువాలో గుస‌గులాడుతున్నాయి. ఇక ఆ నేప‌థ్యంలో వీరిద్ద‌రు దంప‌తుల‌కు రాజ‌కీయ విడాకులు త‌ప్ప‌వు అనే ఆలోచ‌న‌లో ఉన్నారు కాంగ్రెస్ నాయ‌కులు. 
 
ఇప్పుడున్న ప‌రిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేసినా కూడా కోలుకునేదిలేద‌ని సాధార‌ణ పౌరుడినుంచి రాజ‌కీయ ప‌రిశీల‌కుల‌దాక తేల్చి చెప్పేస్తున్నారు. అయితే ఈ నేప‌థ్యంలో ప‌న‌బాక దంప‌తులు పార్టీ మారే ఆలోచ‌న చేసిన‌ట్లుగా చ‌ర్చ‌సాగుతోంది. అయితే ఈ క్ర‌మంలో ప‌న‌బాక ల‌క్ష్మీకి జాతీయ‌స్థాయిలో ప‌ద‌వి ఇవ్వాల‌ని పార్టీలో ప్ర‌చారం సాగుతోంది. రానున్న రోజుల్లో ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక‌రెట్ గా లేక సీ డబ్ల్యూసీసీ స‌భ్యురాలిగా నియ‌మించే ఛాన్స్ ఉన్న‌ట్లు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. 
 
ఈ నేప‌థ్యంలో ల‌క్ష్మీ కాంగ్రెస్ లోనే కొన‌సాగుతార‌నే ప్ర‌చారం సాగుతోంది. దీంతో ప‌న‌బాక కృష్ణ‌య్య కాంగ్రెస్ పార్టీని వీడ‌వ‌చ్చ‌ని కార్య‌కర్త‌లు చెబుతున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో ఆయ‌న సైకిల్ ఎక్కే ఛాన్స్ ఉందా.. లేక ఫ్యాన్ ఎక్కే ఛాన్స్ ఉందా.. అనే చ‌ర్చ సాగుతోంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.