వాజ్ పేయి ఇక లేరు...ధ్రువీక‌రించిన గ‌వ‌ర్న‌ర్‌

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-08-16 15:46:40

వాజ్ పేయి ఇక లేరు...ధ్రువీక‌రించిన గ‌వ‌ర్న‌ర్‌

భార‌త మాజీ ప్ర‌ధాన మంత్రి వాజ్ పేయి ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉండ‌టంతో ఆయ‌న‌కు ఎయిమ్స్  ఆసుప‌త్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నేప‌థ్యంలో త్రిపుర గ‌వ‌ర్న‌ర్ త‌థాగ‌త రాయ్, వాజ్ పేయి గురించి ఒక సంచ‌ల‌న ట్వీట్ చేశారు. గొప్ప వ‌క్త ద‌శాబ్దాల పాటు భార‌త రాజ‌కీయాల్లో ధ్రువ‌తార‌లా వెలిగిన మాజీ ప్ర‌ధాన మంత్రి వాజ్ పేయి ఇక‌లేరు. ఓం శాంతి అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.
tripura governor tweet
ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ హోదాలో ఉండి కూడా బ్ర‌తికి ఉన్న వ్య‌క్తి గురించి ఇలా అబ‌ద్ద‌పు ప్ర‌చారం చేయండం ఏంట‌ని నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో దుమ్ము లేపుతున్నారు. ఇక నెటిజ‌న్లు చేస్తున్న విమ‌ర్శ‌లపై త‌థాగ‌త రాయ్ స్పందిస్తూ న‌న్ను క్ష‌మించండి తాను ఉద్దేశ పూర్వ‌కంగా ట్వీట్ చెయ్య‌లేద‌ని ఓ జాతీయ ఛాన‌ల్లో వ‌చ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ట్వీట్ చేశాన‌ని తెలిపారు.
 
ట్వీట్ చేసేముందు అది నిజమా కాదా అనే విష‌యాన్ని తెలుసుకుని ఉండాల్సి ఉంద‌ని వాజ్ పేయి గ‌రించి ఎలాంటి వార్త రాలేద‌ని అందుకే నా ట్వీట్ ను తొల‌గించాని. న‌న్ను క్షమించండి అంటూ ట్వీట్ చేశారు.