క‌మ‌లం పార్టీకి ట‌చ్ లో గులాబీ ఎమ్మెల్యేలు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-02-05 05:42:49

క‌మ‌లం పార్టీకి ట‌చ్ లో గులాబీ ఎమ్మెల్యేలు

అధికార టీఆర్‌ఎస్‌  ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలో చేరేందుకు సమయం కోసం ఎదురు చూస్తు న్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. వారంతా తమతో టచ్‌లో ఉన్నారని, వీలు చూసుకుని బీజేపీలో చేరతారని వెల్లడించారు. కొన్ని ఇతర పార్టీల కీలక నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఈ విషయాలు వెల్ల‌డించారు.
 
ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇది పెరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కేవలం మాటలకే పరిమితమవుతున్నారని, ఈ నాలుగేళ్లలో విపరీతమైన అవినీతి పెరిగిపోవడాన్ని జనం గుర్తించారని, మరో పక్క కేంద్రంలో అవినీతి మచ్చ లేకుండా సాగుతున్న మోదీ పాలనతో బేరీజు వేసుకుని బీజేపీవైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు.ఇటీవల తాను జిల్లాల్లో పర్యటించిన సమయంలో ఆ మార్పును స్పష్టంగా గమనించానని అన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం తన సొంత సర్వేలో కూడా గుర్తించిందన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.