తగ్గేదే లేదు గన్ కి గన్

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-02-10 12:21:29

తగ్గేదే లేదు గన్ కి గన్

సంచలన ఆరోపణలకు పెట్టింది పేరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ఆయన ఏమిచేసినా సంచలనం అవుతుంది .... 10 నెలల్లోనే దాదాపు 1,142 ఎన్‌కౌంటర్లు.. 38 మంది క్రిమినల్స్‌ హతం… ఏకంగా 25 రోజుల్లో 60 ఎన్‌కౌంటర్లు… 8 మంది గ్యాంగ్‌స్టర్లు హతం… ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమం‍త్రి యోగి ఆదిత్యానాథ్‌ ట్రాక్ రికార్డు .
 
యూపీ పోలీస్‌ శాఖ సాధించిన ట్రాక్‌ రికార్డ్. అయితే ఈ వ్వవహారం పై  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ లో పెద్ద దుమారమే లేచింది....ఫేక్ ఎన్ కౌంట‌ర్ ల‌తో,  అమాయక ప్రజలను బలి తీసుకుంటున్నారని ప్రతిపక్షం ఆరోపణలు చేయడం జరిగింది..
 
అయితే ఈ వ్వవహారం పై  అసెంబ్లీ లో పెద్ద రచ్చ జరిగింది... ప్రతిపక్ష పార్టీకి చెందిన కొందరు నేతలు ప్ల‌కార్డులు, నినాదాలతో సభను హోరెత్తించారు.... బెలూన్లను ఎగరేయటం.. గవర్నర్‌ మీదకు పేపర్లను విసిరేయటంతో మార్షల్స్‌ సీన్‌లోకి రావటం వంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం యోగి ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు.
 
యోగి మాట్లాడుతూ…. ప్రతీ ఒక్కరికీ రక్షణ అవసరమని… కానీ, తుపాకీనే నమ్ముకున్న కొందరు మాత్రం శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నారని వెల్లడించారు... అందుకనే తుపాకీకి తుపాకీతోనే దెబ్బ కొట్టాలి. అలాంటి వారికి తూటానే సమాధానం… అని ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో ఎన్నిఆరోపణలు  వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదని అధికారులను ఆదేశించారు.. విమర్శలు చేసేవారు ప్రజల బాగోగులు గురించి ఆలోచించటం లేదు. అలాంటప్పుడు వారిని మేమెందుకు పట్టించుకోవాలి, అని సీఎం యోగి పేర్కొనడం గమనార్హం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.